Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రేమించే దేవుడు ప్రేమించేందుకే మనిషిని సృష్టించాడు

life

వెదజల్లి అభివృద్ధి చెందే వారున్నారు, బిగబట్టి దారిద్య్రంలోకి  జారుకునేవారున్నారు అంటుంది బైబిల్ (సామెతలు 11:24) మానవ సుగుణాలన్నింటిలోకి సర్వోత్తమమైనది దాతృత్వం : దేవుడు మనిషిని గొప్పదాతగా సృష్టించాడు. అందుకే దేవుడు అతన్ని సామాజిక జీవిగా చేశాడు. నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో అంతే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలన్న యేసు క్రీస్తు బోధకు పాతిప్రదిక ఇదే (మార్కు 12:31). ప్రేమించడం అంటే తియ్యగా మాట్లాడటం కాదు ప్రేమించడ మంటే సర్వం ధారపోయడం, ప్రాణాలడ్డువేసి అవతలివారిని ఆపదలో ఆదుకోవడం. అది దేవుని లక్షణం. దేవుని పిల్లలుగా ప్రతి విశ్వాసికి చెందిన ఆత్మీయ డీఎన్‌ఎలో అదే విధంగా ఉండాల్సిన అంశం అవసరాల్లో, ఆపదలో ఉన్నవాడు అందరికీ లోకువే సాయం చేసిన వాడు  తక్కువ నిందిస్తారు కాని చేయని వారు మాత్రం చెలరేగి పోతారు. ఆపదలో పడేందుకు దారి తీసిన కారణాలను పోస్టుమార్టం చేయడంలోని ఆసక్తి ఆదుకోవడంలో కనిపించదు.  చిన్న పెద్ద బీద గొప్ప అనే తేడా లేకుండా అందరిని ఏదో ఒక రోజు పలకరించే చుట్టం ఆపద!  ‘ఎంతో  కేలిక్యులేటెడ్’గా అత్యంత చాకచక్యంగా బతికేవారు కూడ ఏదో ఒకరూపంలో ఏదో ఒకరోజు అనూహ్యమైన చిక్కుల్లో పడ్డప్పుడు  తాము ఎంత బలహీనులమో వారికర్థమవుతుంది. అందుకే అవసరాల్లో, ఆపదల్లో ఉన్నవారిని  చులకనగా మాట్లాడటం తొందరపాటుతనమని, విజ్ఞతారాహిత్యమని గ్రహించాలి.  మనుషులంతా ఒకరి సాయం లేకుండా మరొకరు బతకలేని సంఘ జీవులు మాత్రమే కాదు, ప్రతి అవసరానికీ, ఆశీర్వాదానికీ అంతా కలిసి దేవుని మీద ఆధారపడిన పరలోకపు తండ్రి సంతానమే మానవాళి  అని గ్రహించాలి. విశ్వాసి తన పొరుగువాడికి ఎంత సాయం చేస్తాడో దేవుడు అతడు లేదా ఆమె పట్ల అంతగా ప్రసన్నమవుతాడు. అందరికీ మామూలుగా అడక్కుండానే  అన్నీ ఇచ్చే దేవుడు,  విశ్వాసి పట్ల ప్రసన్నుడైతే  ఆశీర్వాదాలకు అంతే లేదు. ప్రపంచీకరణ డిజిటలైజేషన్ ఉప్పెనలో కొట్టుకుపోతున్న నేటి తరానికి నానాటికీ ‘మనసు’ ఒక్కరికి మానవీయ స్పందన లోపిస్తోంది. అంతా ఎవరి గురించి వారే ఆలోచించు కునే స్వార్థ్ధం అనే ఊబిలో కూరుకుపోతున్నారు. పొరుగువారి సంపద వదిలివేయండి, సొంత తోబుట్టువులు, తల్లిదండ్రులను కూడ అన్యుల జాబితాలో చేర్చిన తరం మనది. అందుకే పెంచుకునే కుక్కలు, పిల్లులు వంటి జంతువులు  ఇంట్లో పట్టుపరుపుల మీద దొర్లుతూంటే కనిపెంచిన తల్లి తండ్రులు వృద్ధాశ్రమంలో మగ్గుతున్నారు. ఇలా మానవ సంబంధాలు, అనుబంధాలు పతనావస్థలో ఉన్నాయంటే, ఈ లోకమంతా జంతువులుండే అరణ్యంగా మారుతోందని అర్థ్ధం.

Comments

comments