Search
Sunday 21 January 2018
  • :
  • :

మనోడికి గోల్డెన్ గ్లోబ్

Award

భారత సంతతి నటుడికి తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ యేటి వేడుకల్లో అజీజ్ అన్సారీ టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ద మాస్టర్ ఆఫ్ నన్ అన్న కామిడీ సిరీస్‌లో అజిజ్ అన్సారీ నటించాడు. అవార్డును గెలుచుకోవడం సంతోషంగా ఉందని 34 ఏళ్ల అజిజ్ తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ద మాస్టర్ ఆఫ్ నన్ సిరీస్ వస్తోంది. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయ్యాడు. కానీ ఈ సారి అన్సారీ అవార్డును గెలుచుకోవడం విశేషం. కామిటీ క్యాటగిరీలో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న మొదటి ఆసియా నటుడు కూడా ఇతనే. ఆంధోనీ అండర్సన్, కెవిన్ బీకన్, విలియమ్ మాకీ, ఎరిక్ మెక్‌కార్మాక్ నుంచి అన్సారీ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు.
– లాస్ ఏంజిల్స్

Comments

comments