Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ భూమి కబ్జా… అక్రమంగా వెంచర్ నిర్మాణం

ph6

 అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు
 నిద్రావస్తలో అధికారులు… కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి
 సొమ్ముసేసుకుంటున్న రియల్ వ్యాపారులు
 ప్రజా ప్రతినిధుల ఆందోళన
ఘట్‌కేసర్ : ప్రభుత్వ భూమినిలో వెంచర్ నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రతాప సింగారం సర్పంచ్ బాషగల్ల అండాలు, ఎంపిటీసీ సభ్యులు బాషగల్ల సంజయ్‌గౌడ్ పేర్కొన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బాషగల్ల అండాలు, సంజయ్‌గౌడ్‌లు మాట్లాడుతూ ఘట్‌కేసర్ మండల పరిధిలోని కాచవాని సింగారం అనుబంధ గ్రామం ముత్వెల్లిగూడ సర్వే నెంబర్ 25లో 3.14 గుంటల పట్టా భూమిలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముత్వెల్లిగూడ – ప్రతాపసింగారం గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు రాళ్లను తొలగించి సర్వే నెంబర్ 25లో నుండి మూసి కాలువ వెలుతున్నట్లు తెలిపారు. నారాయణవారు మూసికాలువ వెళ్లింది. కాలువ కింద పోయిన భూమికి బదులు రియల్ వ్యాపారులు, పక్కనే ఉన్న ప్రభుత్వం భూమిపై కన్నేశారు. సర్వే నెంబర్ 378లో ఉన్న ప్రభుత్వ భూమిలో నుండి 1 ఎకరా 20 గుంటల భూమి కబ్జాచేసి రోడ్డు నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. ఆ భూమిలో అక్రమంగా వెంచర్ నిర్మాణం చేసి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నదని పలు మార్లు జిల్లా కలెక్టర్‌కు, తహసిల్ధార్, ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులకు, హెచ్.ఎం.డి.ఎ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పిర్యాదులు చేసిన అధికారులలో చలనం లేదని, యథేచ్చగా రియల్‌వ్యాపారులు ఆ భూమిలో నిర్మాణం చేసిన వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసుకొని, సొమ్ము చేసుకుంటున్నట్లు వివరించారు.
నారపల్లి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రియల్‌వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారంటే అధికార పార్టీకి చెందిన కొందరి నాయకుల సహకారంతో జరుతున్నట్లు ఆరోపించారు. ప్రతాపసింగారం గ్రామంలో అక్రమ వెంచర్ నిర్మాణం చేసి, కాచవాని సింగారం గ్రామ పంచాయతీ 1988లో ఎన్నికైన సర్పంచ్ హన్మంత్‌రెడ్డి సంతకంతో ఫోర్జరీ చేసి వెంచర్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. 1988 సంవత్సరంలో ప్రతాపసింగారం సర్పంచ్‌గా ప్రస్తుత ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి ఉన్నారని పెలిపారు. ఈ విషయం హన్మంత్‌రెడ్డి తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంతకం ఫోర్జరీ చేయడంపై మండిపడినట్లు వివరించారు. ప్రభుత్వ భూమిని కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాషగల్ల అండాలు, ఎంపిటిసి బాషగల్ల సంజయ్‌గౌడ్ వార్డు సభ్యులు మల్లేష్, భాస్కర్, భాగ్యమ్మ, నాయకులు యదగిరి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments