Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వ తోడ్పాటు

speak2

*కుమ్మరుల సంక్షేమానికి రూ.100కోట్లు
*కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 15లక్షలు
*తెలంగాణ కుమ్మరి సంఘం డివిజన్ స్థాయి బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మనతెలంగాణ/కొండమల్లెపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం తోడ్పాటునందింస్థుందని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నా రు. శనివారం మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు లో గల సాయి కృప ఫంక్షణ్‌హాల్‌లో  కుమ్మరి సంఘం జిల్లా  యువజన అధ్యక్షుడు ఎలిమినేటి సాయి, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు తోటపల్లి వల్లయ్యల అధ్యక్షతను ఏర్పాటు చేసిన తెలంగాణ కుమ్మర సం ఘం డివిజన్ స్థాయి బహిరంగ సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తి దారుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో  కులవృత్తులు అంతరించి పోతున్నాయని, కుల వృత్తులు రైతుల ఆర్ధిక  పరిపుష్టిని సాదిస్తేనే కేసీఆర్ కలుగన్న బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.ఆ దిశగా రాష్ట్రంలో కుమ్మర సామాజిక వర్గాన్ని గుర్తించి కుమ్మర వాలీవాహాన ఫెడరేషన్ ద్వారా రూ.100 కోట్లతో అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో యాదవులకు సభ్సిడితో గోర్రెలు, కుల వృత్తులు చేసుకోనే రజకులకు వాషింగ్ మిషన్‌లు, నాయి బ్రహ్మణ కులాలకు రూ లక్షతో మోడ్రన్ సెలూన్ ఏర్పాటుతో పాటు కార్పోరేషన్ రుణాలను అందించనున్నట్లు వారు తెలిపారు. బ్యాంకులతో సంబందం లేకుండా నేరుగా రుణాలు, 50 ఎళ్లు దాటిన కుమ్మర వృద్దులకు పెన్షన్‌కు సంబందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.  మండల కేంద్రంలో కుమ్మర కమ్యూనీటి  హాల్ నిర్మాణానికి  సంబందించి ఎంపి నిధుల నుండి రూ.10 లక్షలు ఎమ్యెల్యే నిధుల నుండి రూ.5 లక్షలను  కెటాయిసుస్తామన్నారు.  తెలంగాణ ప్రభుత్వ అందిస్తున్న పలు సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకుని అర్ధికంగా అభివృద్ది చేందాలన్నారు.  కుల వృత్తుల వారి తెలంగాణ  రాష్ట్ర యంబీసీ అధ్యక్షుడు తాడురి శ్రీనివాస్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తిదారులకు తగిన ప్రాధాన్యత  అందిస్తుందన్నారు. కుమ్మర ఉత్పత్తులకు సంబందించిన కేంద్రాని ఈ ప్రాంతాంలో ఏర్పాటుఅయ్యేలా  కృషి చేస్తానన్నారు.    ఈ కార్యక్రమంలో యంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, కుమ్మర రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయంత్‌రావు,రాజమల్లయ్య, జిల్లా అధ్యక్షకార్యదర్శులు నిమ్మనగోటికృష్ణయ్య, గంగాదర వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంఠ రాములు,రాదపురం భిక్షపతి, బోడుపల్లి యల్లయ్య దేవరకొండ నియోజకవర్గం కార్యదర్శి ఘనపురం శంకర్, మాడ్డుల యాదగిరి, బోడ్డుపల్లి శంకర్,  తోటపల్లి శ్రీను, దామోదర్, వేరుకొండ రాము, ఘనపురం వెంకటయ్య, కోమండ్ల శ్రీనివాష్, ఎలిమినేటి అంజనేయులు, బోడ్డుపల్లి మల్లేష్, గుమ్మడవెళ్లి వెంకటయ్య, వెంకటాపురం అచ్చాలు, బొడ్డుపల్లి ముత్యాలు, జంగయ్య, బీజి కళాకారుల సంఘం అధ్యక్షుడు రామలింగం, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments