Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

celebratiinsమనతెలంగాణ/మెదక్ : నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆర్డీవో మెంచు నగేష్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. ప్రజలందరూ 2018 నూతన సంవత్సరంలో ఆనందంగా జీవించాలని, ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రేగోడు మండలంలో… మండల కేంద్రమైన రేగోడు నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను చిన్నారులు, యువకులు ఘనంగా జరుపుకున్నారు. 2018 కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా యువకులు, చిన్నారులు ఆటపాటలు నిర్వహించి 2018 నూతన సంవత్సరానికి ఆహ్వా నం పలికారు.

Comments

comments