Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రోడ్డుప్రమాదంలో హెచ్‌ సియు విద్యార్థిని మృతి

Car-Accident-in-ORR

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్జుగడ్డ వద్ద కారు బోల్తా పడడంతో యుపికి చెందిన విద్యార్థిని అనన్య మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెద్దఅంబర్ పేట నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనన్య అనే విద్యార్థిని  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోల్తా పడిన కారును స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Comments

comments