Search
Friday 20 April 2018
  • :
  • :

ఓ షోకు వెళ్లి.. కిడ్నాప్‌కు గురయ్యా: నమిత

namitha
హైదరాబాద్: ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్న కథానాయిక నమిత ఇటీవల తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులు మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా నమిత పలు విషయాలను మీడియాతో పంచుకుంది. నా తొలి క్రష్ నాగార్జున అని చెప్పారు. నా చిన్నప్పుడు తొలిసారి నాగార్జునని చూసి ఈయన చాలా అందంగా ఉన్నారే అని అనుకున్నానని అన్నారు. తమిళనాడులో తనకు గుడి కట్టడం గురించి మాట్లాడుతూ.. నేను అభిమానుల మనోభావాలు, ప్రేమను గౌరవిస్తానని ఆమె అన్నారు. 2009 అక్టోబర్ 23వ తేదీన ఓ షోకోసం తిరుచ్చి వెళ్లాను. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి, నేను మీ డ్రైవర్‌నని చెప్పాడు. ఆర్గనైజర్ పంపిన కారు అనుకొని ఎక్కాను. కొంత దూరం ప్రయాణించిన తర్వాత కారు వేరే దారిలో వెళ్తుందని అనుమానం వచ్చి, షో ఆర్గనైజర్‌కు మెసెజ్ చేశాను. ఎక్కడ ఉన్నావని, విమానాశ్రయం వద్ద ఎదురు చూస్తున్నామని వారు చెప్పారు. అదేంటి నేను కారు ఎక్కానని చెప్పా, వాళ్లు లేదనండంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. అద్దం నుంచి డ్రైవర్ నన్నే చూస్తుండటం గమనించా. ఏదో గోదాంలో పెళ్లికి సిద్ధం చేశారు. ఈ లోపే పోలీసులు వచ్చి నన్ను కాపాడి, మీరు కిడ్నాప్ అయ్యారని చెప్పారు’ అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Comments

comments