Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

చెమట చిందించిన రోబో

Robo-image

రోజుకో కొత్త పరిశోధనలతో శాస్త్ర సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ కీలకంగా మారుతున్నాయి. తాజా మరో రోబో అద్భుతానికి జపాన్ శాస్త్రవేత్తలు తెరతీశారు. ఈ రోబో పేరు కెంగోరో. మనలాగే వ్యాయామం చేస్తోన్న ఈ హ్యూమనాయిడ్ రోబోకు చెమట కూడా వస్తుందట! దీన్ని జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు.

క్రీడలు, అథ్లెట్ల కండరాల విశ్లేషణతో పాటు మ్యూజిక్ రంగంలోనూ దీన్ని ఉపయోగించనున్నారు. గత కొన్నేళ్ల నుంచి హ్యూమనాయిడ్ రోబోలను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నప్పటికీ, 2001లో కెంటా తర్వాత సిరీస్‌లో రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబో అత్యంత ఆధునీకతను సంతరించుకున్నదని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. కృత్రిమ చెమటను సృష్టించిన ఈ రోబోటిక్ పరిశోధన ఓ గొప్ప అద్భుతమని పలు సైన్స్ రోబోటిక్ పత్రికలు కొనియాడుతున్నాయి. మనిషి చేసినట్లుగా ఫుష్ అప్స్, పుల్ అప్స్ చేయడంతో పాటు పలు బంగిమల్లో వ్యాయామం చేసే ఈ రోబోకు చెమట కూడా రావడం గమనార్హం.

Comments

comments