Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నో రీమేక్స్ : బాలయ్య

Balaiah

హైదరాబాద్ : రీమేక్ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి తనకు లేదని హీరో, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆయన నటించిన ‘జైసింహ’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ‘ జై సింహ ’ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను భవిష్యత్‌లో నటించే సినిమాలపై ఆయన మాట్లాడారు. తాను గతంలో ఓ రీమేక్ చిత్రంలో నటించానని, అది ప్లాపయిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనకు రీమేక్ చిత్రాలంటే ఇష్టం లేదని చెప్పారు. ఒకవేళ రీమేక్ హిట్ అయినా, ఆ క్రెడిట్ అంతా ఒరిజినల్ చిత్రంలో నటించిన హీరోకే వెళ్లిపోతుందని ఆయన పేర్కొన్నారు. మంచి కథ, కథనాలతో ఉన్న చిత్రాల్లో తాను నటిస్తానని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

I don’t act in Remake Films : Telugu Hero Balaiah

Comments

comments