Search
Sunday 21 January 2018
  • :
  • :

టిపిసిసి పదవి ఆశించా : కోమటిరెడ్డి

KV

నల్గొండ : తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశించిన మాట నిజమేనని మాజీ మంత్రి, నల్గొండ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పిసిసి చీఫ్‌గా ఎవరున్నా, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తలా కొన్ని నియోజకవర్గాలను పంచుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సులభతరమవుతుందని ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు వర్గాలకతీతంగా కాంగ్రెస్ నేతలు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తేల్చి చెప్పారు.

I Expect TPCC Post : Komati Reddy

Comments

comments