Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అవినీతిని నిరూపిస్తా

rnt

లేకపోతే అబిడ్స్ సెంటర్‌లో ముక్కు నేలకు రాస్తా

 టెండర్లు లేకుండా విద్యుత్ ప్లాంట్ల అప్పగింత
 చర్చ కోసం అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ సహా కాంగ్రెస్ నేతల ఎదురు చూపు

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి జరిగిందని, భద్రాద్రి, కొత్తగూడెం యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లకు సంబంధించి వేల కోట్ల పనులను టెండర్లు లేకుండా బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించడం వెనుక మతలబు ఉన్నదని, వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తానని కాంగ్రెస్ నాయకులు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌కు పారదర్శకత ఉంటే వీటిపై సిబిఐ లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్(సివిసి) దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తామే కేసులు వేసి సిఎం కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులను చర్లపల్లి జైలులో కూర్చోబెడుతామన్నారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ఆబిడ్స్ సెంటర్‌లో ముక్కు నేలకు రాస్తానని అన్నారు. విద్యుత్‌పై కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య బహిరంగ చర్చకు సవాళ్ళ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్, కాంగ్రెస్ నేతలు కార్తీక్‌రెడ్డి, రవీంద్రనాయక్, కూన శ్రీశైలంగౌడ్, తోటకూర జంగయ్య యాదవ్ తదితరులు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడే గంట సేపు వేచి చూసి అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలన్న టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌లు , మరుసటి రోజే రేవంత్‌రెడ్డికి విశ్వసనీయ లేనందున రామనడాన్ని తప్పుబట్టారు. తన విశ్వసనీయతను ప్రశ్నిస్తున్న వారు,తెలంగాణ ఉద్యమ సమయంలో పోలవరం కడితే రక్తం ఏరులై పారుతుందన్న కెసిఆర్, ఆ తరువాత తన బినామి సంస్థ ఎస్‌ఇడబ్లుకే ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును సాధించడాన్ని తానే ఆధారాలతో వెలికితీసినని గుర్తు తెచ్చుకోవాలని, దాంతో ఆ టెండర్లు రద్దు చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. తన విశ్వసనీయత గురించి చర్చ జరగాలంటే, సిఎం కెసిఆర్, తాను ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు భద్రత లేకుండా వెళ్ళి గంటసేపు ఆర్ట్ కాలేజీ వద్ద నిలబడితే తెలుస్తుందన్నారు. దళితున్ని ముఖ్య మంత్రి చేస్తానని తానే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు.
బిహెచ్‌ఇఎల్‌కు ఇవ్వడంతో రూ.5వేల కోట్లు భారం
భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి మొత్తం రూ.30,400 కోట్ల పనులను ఎలాంటి టెండర్‌లు లేకుండానే బిహెచ్‌ఇఎల్‌కు ఎలా కట్టుబెట్టారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ టెండర్లు లేకుండా పనులు అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. జార్ఖండ్ ప్రభుత్వం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టుపై టెండర్లు పిలిస్తే, ఇదే బిహెచ్‌ఇఎల్ ఇతర సంస్థలతో పోటీపడి రూ.2,400 కోట్లు తక్కువకు పనులను దక్కించుకున్నదన్నారు. ఆ లెక్కన రూ.30వేల కోట్ల పనులకు టెండర్లు పిలిస్తే రూ.5వేల కోట్లు జెన్‌కోకు మిగిలేవని చెప్పారు. ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్ మాట్లాడుతూ తమను చర్చకు పిలిచి రాకపోవడం ద్వారానే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లయిందని, అభాసు పాలవుతామనే వారు రాలేదన్నారు. తనను ఉద్దేశించి ఎప్పుడు పార్టీలో ఉంటాడో లేడో తెలియదన్న బాల్క సుమన్, అదే మీడియా సమావేశంలో ఆయన పక్కన కూర్చున్న భానుప్రసాద్ మొన్నటి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం మరిచిపోయినట్లుందనానరు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదన్నారు.

Comments

comments