Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఐడియా వొడాఫోన్ విలీనానికి ఎన్‌సిఎల్‌టి ఆమోదం

idia

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియకు ఆమోద ముద్రపడింది. ఐడియాలో వొడాఫోన్- విలీనానికి ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) అనుమతిచ్చింది. ఈ మేరకు ఐడియా సెల్యూలా ర్ ఒక ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ జియో నుంచి పోటీ నేపథ్యంలో సంస్థలు విలీనానికి శ్రీకారం చుట్టాయి. గతేడాదిలో వొడాఫోన్-ఐడియా విలీన ప్రకటన చేయగా, ప్రస్తుతం ఈ ఒప్పందానికి ట్రిబ్యున ల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్‌సిఎల్‌టి అనుమతి లభించిన నేపథ్యంలో తుది అనుమతుల కోసం టెలికాం విభాగాన్ని (డిఒటి) ఆశ్రయించనున్నాయి. ప్రస్తుతం టెలికాం రంగంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఈ కంపెనీలు విలీనం కావడంతో 35 శాతం మార్కెట్ వాటాతో ఇది అతిపెద్ద కంపెనీగా అవతరించ నుంది. విలీన కంపెనీలో వొడాఫోన్‌కు 45.1 శాతం, ఐడియాకు 26 శాతం, ఇతరులకు 28.9 శాతం వాటా ఉంటుంది. విలీనం తర్వాత ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పరమితం కానుంది. భారతీ ఎయిర్‌టెల్‌కు 28.9 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, వొడాఫోన్, ఐడియాకు వరుసగా 21.1 కోట్ల్ల, 19.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. నవంబరు చివరి నాటికి రిలయన్స్ జియోకు 15.2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.

Comments

comments