Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించండి

SITARAM

ఢిల్లీ : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టిఆర్‌ఎస్ ఎంపి సీతారాంనాయక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో ఆయన గురువారం మాట్లాడారు. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా హాజరవుతారని ఆయన చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులే కాక గిరిజనేతరులు సైతం ఈ జాతరకు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ఆయన చెప్పారు. గిరిజన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ చొరవ తీసుకుని మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు చర్య లు తీసుకోవాలని ఆయన కోరారు. ఈనెల 31న మేడారం జాతర ప్రారంభం కానుంది. జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Identify Medaram Jatara as a National Festival

Comments

comments