Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ డీలా

ktr

నిరంతర విద్యుత్ సక్సెస్ కావడంతో దానికి ఓటమి భయం
జైలుకెళ్లిన వారా నీతులు చెప్పేది?
కరెంట్‌పై ఆధారాలుంటే కోర్టుకెళ్లాలి
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం కేంద్రానికి ఉందా?
మేము ఎప్పుడైనా సిద్ధమే : మంత్రి కెటిఆర్

 హైదరాబాద్: కరెంటు కోనుగోలు ఆరోపణలపై ఆధారాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పరిశ్రమల శాఖమం త్రి కె.తారకరామారావు అన్నారు. జైల్లో చిప్పకూడు తిన్నవారు సైతం అవినీతి గురించి మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. కరెంటు సరఫరాపై చర్చించేందుకు శాననసభ ఉన్నదని, అక్కడ కాంగ్రెస్ నాయకులు చర్చించకుండా పారిపోతారన్నారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం విషయంలో అఖిలపక్ష సమావేశం ఎందుకని, శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు చర్చించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టం విషయమై ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయ న్నా రు.సచివాలయంలో శనివారం మంత్రి కెటిఆర్ పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ కడుపుమండుతోందని రాష్ట్రంలో టిఆర్‌ఎస్ బలపడితే భవిష్యత్తులో తాము ఎప్పటికీ అధికరాంలోకి రాలేమనే భయంంతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం కేంద్రానికి ఉన్నదా అని ప్రశ్నించిన మంత్రి కెటిఆర్, తమది పనిచేసే ప్రభుత్వమని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభు త్వం ముందుగానే గవర్నర్‌కు నివేదించిందని, వాస్తవాలు తెలిసే కాంగ్రెస్ నేతలతో గవర్నర్ మాట్లాడారని, గవర్నర్ నేరుగా కలెక్టర్, ఎస్‌పిలను సంప్రదించి సమాచారాన్ని తెప్పించుకున్నారని వివరించారు.

Comments

comments