Search
Friday 20 April 2018
  • :
  • :

అదనంగా ఇస్తేనే ధాన్యం తరలింపు

rice

*ఐకెపి కేంద్రాల వద్ద గుట్టలుగా ధాన్యం బస్తాలు
*ట్రాన్స్‌ఫోర్టర్లపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు
*ఇబ్బందులు పడుతున్న రైతులు

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: – ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు గుట్టలుగా పేరుకుపోతున్నా యి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు చేర్చేందుకు లారీ యజమానులుమొండికేస్తున్నారు. క్వింటాకు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు అదనంగా ఇస్తేనే ధాన్యం తరలిస్తామని బాహాటంగా చెబుతున్నారు. లారీ ఆఫీసుల నుంచి చుట్టుపక్క  గ్రామాలలో కొనుగోలు కేంద్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్‌పోర్టు డబ్బులు కాకుండా బస్తాకు ఎంత అదనంగా ఇస్తారని రైతులను ఇబ్బందులుపెడుతున్నా రు. మీరు డబ్బులు ఇస్తేనే ధాన్యం తీసుకపోతాం లేదంటే మీ ఇష్టమంటూ కొనుగోలు కేంద్రాలలోనే వదిలి వెళ్తున్నార ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే మీరు ఎవరికి చెప్పుకున్నా మాకు అభ్యంతరంలేదు. మీరు ప్రభు త్వ ట్రాన్స్‌పోర్టు కిరాయి కన్నా అదనంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకపోకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే అక్కడ ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. ఎ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాకు 1590 రూపాయలు, కామన్‌గ్రేడ్‌లేదా బిగ్రేడ్ ధాన్యాన్ని 1570 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరగా ప్రకటించింది. వ్యాపారులైనా, రైస్ మిల్లర్లయినా, కొనుగోలు కేంద్రాలైన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను చెల్లించాల్సి ఉంటుంది. దళారీ లేకుండా నేరుగా రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుంది. కొనుగోలు కేంద్రాలలో కూడా గోల్‌మాల్ జరుగుతోందని రైతులు వాపోతున్నారు.
తూకాలలో తేడా
కొనుగోలు కేంద్రాలలో 40కిలోల బస్తాలో ధాన్యం కాంటాలను వేస్తారు. ధాన్యం కాంటాలను వేసేటప్పుడు అరకిలో అదనంగా కాంటాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదే మంటే సంఘాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకపోతే షార్టేజి(తరుగు) వస్తుందని అందుకే బస్తా కు అరకిలో ఎక్కువగా కాంటాలు పెట్టడం జరుగుతుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రం నుంచి
ధాన్యం వెళ్లి వరకు రైతుదే బాధ్యత
రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి కాం టాలు వేస్తే రైతు పనిపూర్తి అయినట్లు కాదు. కాంటాలు వేసి న ధాన్యం బస్తాలు సంబంధిత గోదాం పాయింట్ లేదా రైస్ మిల్ పాయింట్‌కు వెళ్లితేనే రైతు బాధ్యత తీరినట్లువుతుంది. దీనిని ఆసరా చేసుకొని లారీ యజమానులు రైతులను డిమాండ్ చేస్తూ అదనపు డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, కొనుగోలు కేంద్రాల పరిశీలనా అధికారులకు తెలియజెప్పినా స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌పోర్టర్లపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి అధికారులు కేటాయించిన మిల్లుకు తీసుకపోయే బాధ్యత ట్రాన్స్‌పోర్టర్లది. రైతుల నుంచి ట్రాన్స్‌పోర్టర్లు డబ్బులు అడుగుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అదనపు డబ్బుల కోసం రైతులను పీడిస్తున్నారు. ధాన్యం తరలించినందుకు ప్రభుత్వమే ట్రాన్స్‌పోర్టు డబ్బులను చెల్లిస్తుంది. అలాంటప్పుడు లారీ యజమానులకు రైతులు ఎందుకు డబ్బులు చెల్లించాలని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌పోర్టర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments