Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

tyre

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం ః
కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్దురాలు మృతి చెందినట్లు కొత్తపల్లి ఎస్.ఐ రమేష్ తెలిపారు. మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన జంగ లింగవ్వ (58) అనే వృద్దురాలు కరీంనగర్ వైపు నుండి బావుపేట వైపు కుటుంబసభ్యుడి ద్విచక్ర వాహనం మీద వెళుతుండగా చింతకుంట వద్దకు చేరుకోగానే వీరి ముందు వెళుతున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీకి సైడ్ ఇవ్వడంతో లారీ వెనకాల ఉన్న మోటార్‌సైకిల్ అదుపుతప్పడంతో బైక్ వెనకాల కూర్చుని ఉన్న లింగవ్వ లారీ వెనక టైర్ కింద పడిపోయింది. ఆమెపై నుండి లారీ వెళ్ళడంతో శరీరం నుజ్జునుజ్జు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచానామా తరువాత పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్.ఐ రమేష్ వివరించారు.

Comments

comments