Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కబ్జా కోరల్లో… కుమ్మరికుంట!

snake*కోట్లాది రూపాయల విలువ చేసే శిఖం భూముల కబ్జా
*వెలసిన పర్మినెంట్ కట్టడాలు
*రెవెన్యూ అధికారుల అవినీతితో భూములు అన్యాక్రాంతం
*కబ్జాల వెనుక అధికార పార్టీ నాయకులు
*మామూళ్లు దండుకుంటూ అనుమతులు ఇస్తున్న పంచాయతీ అధికారులు

అక్రమార్కులు కొందరు కుంటలను సైతం విడిచి పెట్టడం లేదు. కుంట శిఖం భూములను కబ్జా చేసి, పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి తోడు గ్రామపంచాయతీ అధికారులు మామూళ్లు దండుకుంటూ ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతినిస్తున్నారు. ఈ తతంగం రెవెన్యూ అధికారుల అండదండలతో సాగుతుండగా కబ్జాల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు సమాచా రం. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు కబ్జాల వ్యవహారాన్ని పట్టించుకోకపోగా వందలాది సంఖ్యలో ఇండ్ల నిర్మాణా లు జరుగుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ గ్రూపు గొడవల కారణంగా కుమ్మరికుంట భూముల వ్యవహారం మరోసారి రోడ్డుకెక్కింది. చె న్నూర్ పట్టణం నడిబొడ్డున గల కుమ్మరికుంట భూములను అధికార పార్టీ నేతలతో పాటు కొందరు ప్రైవేట్ అక్రమార్కులు కబ్జా చేసి, ఇండ్ల ను నిర్మించారు. కుమ్మరికుంట గతంలో 19 ఎకరాల్లో విస్తరించి ఉండ గా కబ్జాల కారణంగా నేడు నాలుగు ఎకరాలకే పరిమితమైంది. కొంద రు స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల అవినీతి అక్రమాల వలన 15 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల నుండే ఆస్నాద్ వెళ్లే రహదారిని నిర్మించారు. దీని పక్కనే 916 సర్వే నెంబర్‌లో 1.18 ఎకరాల శిఖం భూమి ఉండగా శిఖం భూ ముల్లో అక్రమ కట్టడాలు చేపట్టరాదని నిబంధనలు ఉన్నప్పటికీ రెవె న్యూ అధికారుల అలసత్వం వలన అక్రమార్కులు కబ్జా చేసిన పక్కా గృ హాలను నిర్మించుకున్నారు. వర్షాకాలంలో కుమ్మరికుంట పూర్తి స్థాయి లో నిండినప్పుడు ఇండ్ల పక్కకు నీరు వస్తుండగా వేసవిలో నీరు ఇనికి పోయి. భూములు కనిపించడంతో అక్రమార్కులు అట్టి భూముల్లో మొ రం పోసి, లెవలింగ్ చేయించుకొని, దానిపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు.

గత 10 సంవత్సరాల కాలంలో కుమ్మరికుంట శిఖం భూముల్లో వందలాది సంఖ్యలో ఇండ్ల వెలిశాయి. గ్రామపంచాయతీ అధికారులు ఇండ్ల అనుమతి కోసం పెద్ద ఎత్తున ముడుపులు పొందుతూ అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో కుమ్మరికుంట భూములు అన్యాక్రాం తం అవుతున్నాయి. ఇటీవల శిఖం భూమిలో అర్థరాత్రి సెంట్రల్ లైటిం గ్ ఏర్పాటు చేసి, పక్క భవనం నిర్మిస్తుండగా టిఆర్‌ఎస్‌కు చెందిన రెం డు గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకొని, శిఖం భూముల కబ్జాల వ్యవహారం మరోసారి రోడ్డుకెక్కింది.   టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి వర్గీయులు, మాజీ ఎంపి ప్రభుత్వ సలహదారుడు వివేక్ గ్రూపుల మధ్య గొడవ చేసుకోగా ఒక వర్గం వారు అక్రమ కట్టడాలకు మద్దతు తెలిపారు.  రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాన్ని ఆపేసేందుకు యత్నించగా వారికి పోలీసులు సహకరించలేదు. దీంతో ఇంటి నిర్మాణం యదేచ్చగా జరగగా కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  శిఖం భూముల్లో అక్రమ కట్టడాలు  వెలిసిన ప్రతి సారి విపక్ష పార్టీల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వారు వచ్చి విచారణ జరిపి వెళ్లిపోవడం  పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు అక్రమ కట్టడాలపై  ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన దినదినానికి అక్రమ కట్టడాలు రెట్టింపు అవుతున్నాయి. ఏదిఏమైనా ఉన్నతాధికారులు అక్రమ  కట్టడాలపై విచారణ జరిపి  చర్యలు తీసుకోకపోయినట్లయితే రాబోయే రో జుల్లో కుమ్మరికుంట కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి.

Comments

comments