Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్

Under-19

మాంట్ మాగన్యూ: బే ఓవల్ మైదానంలో అండర్-19 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 100 పరుగుల తేడాతో  భారత్ ఘోరంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లలో పృధ్వీషా (94), మన్ జోట్ కర్లా (86), శుభమ్ గిల్(63), అభిషేక్ శర్మ(23) పరుగులు చేశారు. తొలి వికెట్ పై 180 పరుగులు భాగస్వామ్యాన్ని షా, కర్లా నెలకొల్పారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లు తీయగా, సుధర్ లాండ్, పరమ్ ఉప్పల్, అస్టిన్ వావ్ తలో వికెట్ పడగొట్టారు.

329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో శివమ్ మావి, కమలేశ్ నగర్ కోటి చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అభిషేక్ శర్మ, అను కుల్ సుధాకర్ రాయ్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో జాక్ ఎడ్వర్డ్ (73), జాన్ థాన్ మెర్లో (38), బాక్సటర్ హోల్డ్ (39), మాక్స్ బ్రాంట్ (29), జోషన్ సంగ్(14), విల్ సుథర్ లాండ్(10) మిగతా బ్యాట్స్  మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పృధ్వీషా ను వరించింది.

Comments

comments