Search
Saturday 21 April 2018
  • :
  • :

మంట గలిసిన మాతృత్వం..!

baby-body
– బావిలో నవజాత శిశువు మృతదేహం
మన తెలంగాణ/టేకులపల్లి ః అది అక్రమమో… సక్రమమో… ఏ తల్లి కన్నబిడ్డో… పుట్టి పుట్టగానే నూరేళ్లు నిండాయి. ఊరి బయట ఉన్న బావిలో అప్పుడే జన్మించిన మగ శిశువు మృత దేహం నీటిలో తేలియాడుతూ ఉంది. మాతృత్వం మంటగలిసింది. కన్న పేగు కర్కశమైంది. మాతృత్వం మంట గలిసింది. నవ మాసాలు మోసిన కన్న తల్లి కఠినంగా మారి నిర్ధాక్షిణ్యంగా కన్న కొడుకును బావిలో పడేసింది. గుండెలను కలిచివేసే ఈ దృశ్యం టేకులపల్లి మండల పరిధిలోని బోడు పంచాయితీ ఆర్‌సి పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎప్పటిలాగే గ్రామస్తులు, రైతులు ఆదివారం ఉదయం పొలం పనులు, ఇతరత్రా పనులకు బయటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఊరి సమీపంలో ఉన్న బావిలో చిన్నారి శిశువు మృత దేహం నీటిలో తేలియాడుతూ ఉండడాన్ని గమనించారు. ఈ విషయం గ్రామంలో నిమిషాల్లో వ్యాపించింది. భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకుని ఈ కాఠిన్యాన్ని చూసి చలించిపోయారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తమకు తోచిన విధంగా తిట్లతో పురాణంతో నిందించారు. బోడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిశువు మృత దేహాన్ని బావిలో నుంచి బయటికి తీశారు. శిశువు వయస్సు రెండు, మూడు రోజులుంటుందని వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుకల అనిల్ తెలిపారు.

Comments

comments