Search
Wednesday 20 June 2018
  • :
  • :

ఇన్ఫోసిస్‌కు మరో అధినేత గుడ్‌బై

Rajesh-Murthy

బెంగళూరు: టాప్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫీకి మరో అధినేత గుడ్‌బై చెప్పారు. ముగ్గురు అధినేతల్లో ఒకరైన రాజేష్ మూర్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్ఫీ సిఇఒగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టడంతో మేనేజ్‌మెంట్‌లో రాజీనామాలు తగ్గుతాయని విశ్లేషకులు భావించారు. కానీ కంపెనీలో రాజీనామాల పర్వం మాత్రం ఆగడం లేదు. అయితే రాజేష్ మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. మూర్తి గత 26 ఏళ్లుగా వివిధ హోదాల్లో కంపెనీకి సేవలందించారు.  కాగా, పరేఖ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ మూర్తినే.

Infosys President Rajesh Murthy Resigns.

Comments

comments