Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అంచనాలను మించిన ఇన్ఫీ

bsns

 క్యూ3లో నికర లాభం
 రూ.5,129 కోట్లు
 గతేడాదితో పోలిస్తే 38 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: డిసెంబర్ 31 ముగింపునాటి మూడో త్రైమాసి క ఫలితాల్లో(క్యూ3) దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించింది. సంస్థ రూ.5,129 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ2) లాభం రూ.3,726 కోట్లతో పోలిస్తే ఈసారి 37.6 శాతం వృద్ధిని సాధించింది. అలాగే 2016 అక్టోబ రు-డిసెంబరు లాభంతో పోలిస్తే 38.3 శాతం పెరిగింది. శుక్రవారం కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించింది. ఇక రెవెన్యూ రూ.17,794 కోట్లతో మెరుగ్గా రాణించగా.. త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే 1.3 శాతం వృద్ధి, వార్షికంగా చూస్తే 3 శాతం వృద్ధిని నమోదు చేసిం ది. తక్కువ పన్ను చెల్లింపులు ఈ వృద్ధికి ప్రధాన కారణం గా కంపెనీ పేర్కొంది. విశాల్ సిక్కా రాజీనామా తర్వాత ఇన్ఫోసిస్ సిఇఒ(ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా సలీల్ పరే ఖ్ బాధ్యతలు చేపట్టారు. ఇవి ఆయనకు తొలి త్రైమాసిక ఫలితాలు కావడం గమనార్హం. మూడో త్రైమాసికంలో కంపెనీ పనితీరు పటిష్ఠంగా ఉందని, నిలకడగా వృద్ధి దిశ గా పయనిస్తున్నామని ఈ సందర్భంగా పరేఖ్ అన్నారు.
డాలర్ విలువల పరంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ గత త్రైమాసికంతో పోలిస్తే 1 శాతం వృద్ధి సాధించింది. కరెన్సీ విలువల్లో 0.8 శాతంతో స్థిరమైన వృద్ధిని చూపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో తమ డాలర్ రెవన్యూ వృద్ధిని స్థిరమైన కరెన్సీ విలువల్లో 5.5 శాతం నుంచి 6.5 శాతం గానే ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. అంతేకాక, ఆపరే టింగ్ మార్జిన్ రేంజ్ గైడెన్స్‌ను కూడా 23 శాతం నుంచి 25 శాతంగానే ఉంచుతున్నట్టు పేర్కొంది. ఇబిఐటి మార్జి న్లు విశ్లేషకులు అంచనావేసిన దానికంటే అధికంగా 24.3 శాతంగా నమోదయ్యాయి. క్యూ3లో కంపెనీ అట్రిషన్ రేటు మాత్రం 15.8 శాతానికి తగ్గగా, గత త్రైమాసికంలో ఈ రేటు 17.2 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో సంస్థ స్థూలంగా 12,622 నియామకాలు చేపట్టింది. దీంతో 2017 డిసెంబరు 31 నాటికి కంపెనీలో ఉద్యోగుల సం ఖ్య 2,01,691కి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో కంపెనీ షేరు విలువ స్వల్పంగా పెరిగింది. కంపెనీ షేరు ధర సుమారు 0.26 శాతం లాభపడి రూ.1,078.65 వద్ద స్థిరపడింది.
ఇన్ఫీ ప్రెసిడెంట్ రాజేష్ మూర్తి రాజీనామా
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి రాజేశ్ మూర్తి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేశా రని, జనవరి 31వరకు ఆయన కంపెనీలో కొనసాగుతా రని కంపెనీ పేర్కొంది. ముగ్గురు అధినేతల్లో రాజేష్ మూ ర్తి ఒకరు.. ఇన్ఫోసిస్ సిఇఒగా సలీల్ పరేఖ్ పదవీ బాధ్య తలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జి క్యూటివ్ ఈయనే. పరేఖ్ రాకతో మేనేజ్‌మెంట్‌లో రాజీనా మాల పర్వం తగ్గుతుందని విశ్లేషకులు భావించారు. ఆశా భావం వ్యక్తంచేశారు. కానీ అయితే కంపెనీలో రాజీనా మాలు మాత్రం ఆగడం లేదు. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు కంపెనీ మేనేజ్‌మెంట్‌లో స్థిరత్వం పొందాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారని తెలుస్తోంది. 26 ఏళ్లుగా ఆయన ఇన్ఫీలో పనిచేస్తున్నారు. జనవరి చివరి వరకు మాత్రమే మూర్తి ఇక ఇన్ఫీలో పనిచేయనున్నారు. గత 26 ఏళ్లుగా ఇన్ఫోసిస్ అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. గత ఏడాది జూన్ నెలలో నలుగురు ఇన్ఫోసిస్ అధినేతల్లో ఒకరైన సందీప్ దాడ్లాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Comments

comments