Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు

ph7

సోషల్ మీడియాతో  మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు

* యువతను సూచించిన… జిల్లా ఇంచార్జీ కలెక్టర్ 

భూపాలపల్లి ప్రతినిధి : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు మేడారం యువత సోషల్  మీడియాను ఉపయోగించుకోవాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. బుధవారం మేడారంలోని ఐటిడిఎ గెస్ట్‌హౌజ్‌లో ఎస్పీ భాస్కరన్ , ఆ లయ పూజారులతో కలిసి మేడారం యువకులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోటి మందికి పైగా భక్తులు వచ్చే అతిపెద్ద గిరిజనజాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర పూర్తిగా ఆదివాసి కోయా సాంప్రదాయ బద్దంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేడారం యువతపై ఉందని సూచించారు. ఇందుకు మేడారం సేవ పేరుతో ఒక దళంగా ఏర్పడాలని ఈ సేవలను వాలీంటర్లుగా జాతర్లో వాడుకుంటామన్నారు. అలాగే జాతరకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాడానికి, ప్రత్యేక లోగోను యువత రూపొందించాలని పేర్కొన్నారు. జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఫేస్ బుక్, ట్వీట్టర్, యూట్యూబ్, వాట్సప్ సాంకేతికను యువత ఉపయోగించుకోవాలని జాతరకు సంబంధించిన ఫోటోలు, సెల్ఫీలు, విడీయోలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తే అంతర్జాతీయంగా ప్రచారం లభిస్తుందని ఇందుకు ఐదుగురు యువకులతో కమిటీ వేసుకోవాలన్నారు. జాతర్లో గిరిజన సాంప్రదాయ ప్రతిభింబించేలా థీంసా, కోలాటం, గుస్సాడి కోయ నృత్యం తదితర సంసృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మీ ఇండ్లల్లో గలస్థలాలను భక్తులకు అద్దెకు ఇ చ్చేందుకు యార్బీ యాప్‌ను ఉపయోగిస్తే మంచి ధరకు రేట్ ఇవ్వచ్చని అన్నారు. మీ పొలాలలో గల స్థ లంలో షాపులను మీరే ఏర్పాటు చేసుకోవాలని అన్నా రు. జాతరలో ప్లాస్టిక్ వాడకుండా బ్యాగ్‌లను వాడాలని, జంపన్న వాగు నుండి క్యూలైన్ల వరకు గర్భిణీలు, దివ్యాంగులు, వృద్ధులకొరకు 10 ఆటోలను జాతర ప్రారంభమయ్యే వరకు నడపాలని కలెక్టర్ అన్నారు.

Comments

comments