Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నా మార్క్ ఫిలిం ఒకటి చేస్తా

‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా మారి గుండమ్మగారి మనవడు, లవ్‌లీ, వైశాఖం వంటి ఫీల్‌గుడ్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించిన జయ.బి దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. ‘వైశాఖం’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సిల్వర్ క్రౌన్ అవార్డు పొందిన ఆమె గురువారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ దర్శకురాలు జయ.బి చెప్పిన విశేషాలు… 

B-Jayaజూన్‌లో ‘లక్కీఫెలో’ ప్రారంభం...
‘వైశాఖం’ చిత్రం నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేశారు. నెక్స్ మా ఆర్.జె. సినిమాస్ బ్యానర్‌లో ‘లక్కీఫెలో’ అనే చిత్రాన్ని రూపొందించనున్నాం. జూన్‌లో సినిమాను ప్రారంభించి మూడు, నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తిచేస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. ఓ యంగ్ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం.
అదే హీరో క్యారెక్టరైజేషన్...
కొంతమందికి అనుకోకుండా, విచ్రితంగా ఒక మంచి ఛాన్స్ వస్తుంది. అది రాగానే అందరూ అతన్ని ‘లక్కీ ఫెలో’ అని అంటారు. అతను ఆ ఛాన్స్ కోసం ప్రయత్నించకపోయినా అతనికి ఆ ఛాన్స్ వస్తుంది. అది చాలా అరుదుగా జరుగుతుంది. అది హీరో క్యారెక్టరైజేషన్. ఆ ఛాన్స్‌ని హీరో సద్వినియోగం చేసుకుంటాడా? ఇంకా హైట్స్‌కు వెళ్తాడా? అనేది కాన్సెప్ట్. హ్యూమన్ సైకాలజీని ఆధారంగా చేసుకొని ఈ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాం.
వినోదంతో పాటు సందేశం…
హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉంటుంది. మన సమాజంలో అమ్మాయిలకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి మానసికంగా వారిని అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ పాయింట్‌ను ఇంతవరకు ఎవరూ టచ్ చేయలేదు. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే అమ్మాయిలు బస్సులో ప్రయాణించేటప్పుడు మగవాళ్లు కొందరు కావాలని, మరికొందరు అనుకోకుండా అమ్మాయిల్ని టచ్ చేస్తారు. ఆ సమయంలో అమ్మాయిలు చాలా ఇబ్బందికి గురవుతారు. ఆ టచ్ వాళ్లని చాలా కాలంపాటు వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. పాటలకు, రొమాన్స్‌కే కాకుండా హీరోయిన్ క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. సినిమాలో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది.
ఆతర్వాత ప్రజల్లోకి వెళ్తా..
మేము ఆశించిన మేరకు ‘వైశాఖం’ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ‘లవ్‌లీ’ సినిమాకు కమర్షియల్‌గా సక్సెస్‌తో పాటు ప్రశంసలు కూడా లభించాయి. ‘లక్కీ ఫెలో’ చిత్రం ‘లవ్‌లీ’ కంటే చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇకనుంచి వైవిద్యభరితమైన మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను మైమరపించాలని కోరుకుంటున్నాను. అలాగే నా మార్క్ ఫిలిం ఒకటి చేయాలని ఉంది. ఆతర్వాత ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమై సేవ చేయాలని ఉంది.
సినిమాకున్న పవర్ అది…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇద్దరు, ముగ్గురే మహిళా దర్శకులు ఉన్నారు. ఇంకా ఎంతోమంది చిత్ర పరిశ్రమలోకి రావాలి. మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరగాలి. ఇక నాకు వెబ్ సిరీస్ చేసే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే. సినిమాలకున్న క్రేజ్ వెబ్ సిరీస్‌కు ఉండదు. ఇప్పటికీ చంటిగాడు, లవ్‌లీ, వైశాఖం చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది సినిమాకున్న పవర్.

Comments

comments