Search
Saturday 21 April 2018
  • :
  • :

సాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం

talk

 * ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి 

మన తెలంగాణ/కల్వకుర్తి: కల్వకుర్తి నియోజ కవర్గ ప్రజల చిరకాలవాంఛ అయిన కెఎల్‌ఐ సాగునీరు ఈ సంవత్సరం గొలుసు చెరువులతో పుష్కలంగా నీటితో నింపడం జరిగిందని అదే విధంగా డి73 ద్వారా మిగతా గ్రామాలకు కూడా సాగు నీరు అందిస్తామని రైతులు అధైర్య పడవద్దని ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలంలో ని పంజుగుల, ముకురాల, గుండూరు గ్రామాలలో ఎంఎల్‌సి పర్యటించి డి73 కాలువ పనుల్లో పై గ్రామాల రైతులు, అధికారులకు కాలువ పనులను ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రైతుల తో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన రైతులకు తెలిపారు. అదే విధంగా పంజుగుల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణ పనులను పరిశీలించి మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో జరిగే విధంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ సూర్య ప్రకాశ్‌రావు, వైఎస్ ఎంపిపి గిరిపర్వతాలుతో పాటు నాయకులు సురేందర్ రెడ్డి, డైరెక్టర్ పండుగ బాలస్వామి తదితరులు ఉన్నారు.

Comments

comments