Search
Sunday 21 January 2018
  • :
  • :

పెద్దల సభకు ఈశ్వర్..!

Eswar-image

వాడి వేడిగా చర్చమంత్రి వర్గ బెర్త్‌పై మళ్లీ ప్రచారం

మన తెలంగాణ / ధర్మారం : సీనియర్ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ భవితవ్యంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, వివాదరహితుడిగా పేరు సంపాదించుకున్న ఈశ్వర్‌కు పెద్దల సభ లేదా మంత్రివర్గంలో స్థానం ఖాయమనే చర్చ ధర్మపురి నియోజక వర్గంతో పాటు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. రెండింటిలో ఎదో ఒకటి ఈ దఫాలో ఈశ్వర్ ఖాతాలో చేరడం ఖాయమని, అనుచర వర్గం గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏఫ్రిల్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఈశ్వర్‌కు స్థానం దక్కుతుందానే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బిసి వర్గం నుంచి డి. శ్రీనివాస్, కె. కెశవరావు, బ్రహ్మణ వర్గం నుంచి కెప్టెన్ లక్ష్మికాంతారావులు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. మూడు స్థానాలు టిఆర్‌ఎస్ వశమయ్యే అవకాశాలుండడంతో అభ్యర్థులు ఎంపికపై చర్చ నడుస్తుండగా ఈశ్వర్ పేరు ప్రధానంగా వాడుకలోకి వచ్చింది. మూడింటిలో ఓ స్థానాన్ని బిసిలకు కేటాయిస్తామని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించినందున మరో రెండు స్థానాల్లో ఓ స్థానం నుండి రెడ్డి సామాజిక వర్గాన్ని, మరో స్థానంలో ఎస్సీకి అవకాశం లభించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ పేరు తెరపైకి వచ్చింది. సిఎంకు అత్యంత సన్నిహితుడిగా, ప్రజాప్రతినిధులందరితో సమన్వయంగా ఉండి. ధర్మపురి నియోజకవర్గంలో మంచి పేరున్న ఈశ్వర్‌కు రాజ్యసభ బెర్త్ లభించవచ్చుననే చర్చ సాగుతుంది. ఒక వేళ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపితే ఖాళీ అయ్యే మంత్రి వర్గ స్థానంలో రాజ్యసభకు బదులుగా మంత్రి పదవి ఖరారు కావచ్చుననే ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్‌గా పేరొందిన ఈశ్వర్ 2000 సంవత్సరం తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2004,. 2009, 2014 సాధారణ ఎన్నికలతో పాటు, రెండు సార్లు మధ్యంతర ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర తొలిమంత్రి వర్గంలో స్థానం ఖాయమనుకున్నప్పటికీ సమీకరణల దృష్టా ఈటల, కెటిఆర్‌లకు మంత్రి పదవులు దక్కాయి. మంత్రి వర్గ కూర్పులో అవకాశం లేకపోవడంతో సిఎం కెసిఆర్ చీఫ్ విప్ పదవిని కట్ట బెట్టారు. మధ్యలో ధర్మారం పర్యటన, కరీంనగర్ సభల్లోను సిఎం కెసిఆర్ తన మాటాల్లో ఈశ్వర్‌కు మంత్రి పదవి ఖాయమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం కెసిఆర్ మం చి అవకాశం కల్పించే అవకాశాలున్నాయని పార్టీ నే తలే చెబుతున్నారు. సీనియార్టీ, సౌమ్యుడైన ఈశ్వర్‌ను రాజ్యసభకు పంపే అ వకాశాలు మెండుగా ఉ న్నాయని, లేనిపక్షంలో ఈ యేడు ఎన్నికల సంవత్సారాన్ని దృష్టిలో ఉంచుకొని జరిగే మంత్రి వర్గ మార్పు లు, చేర్పులలో అవకాశం లభించవచ్చునని సన్నిహితులు ధీమాగా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ ఈశ్వర్ పేరు తెరపైకి వచ్చి వాడి వేడిగా చర్చ జరుగుతుండడం గమనార్హం.

Comments

comments