Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

పాక్‌లో వేళ్లూనుకున్న ఐసిస్

మేధావుల భద్రతా నివేదిక వెల్లడి

ISIS

ఇస్లామాబాద్/వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర గ్రూపు పాకిస్థాన్‌కు పెద్ద బెడదగా తయారయిందని, పాక్‌లో దాని ఉనికి రానురాను పెరుగుతోందని ఒక మేధావుల బృందం నివేదిక తెలిపింది. దేశంలో ఐఎస్ వ్యవస్థీకృత జాడలు లేవని పాక్ ప్రభుత్వం ఖండిస్తోంది. అయితే ఇటీవల కొన్నేళ్లుగాబలూచిస్థాన్‌లో చాలా దాడులకు తమదే బాధ్యతని ఆ ఉగ్ర సంస్థ ప్రకటనలు చేసిం ది. పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ (శాంతి అధ్యయనాల సంస్థ పిఐపిఎస్) ఆదివారం విడుదల చేసిన భద్రతా నివేదికలో ఐఎస్ ఉనికి గురించి కొన్ని వాస్తవాలు ప్రకటించింది. ఉత్తర సింధు, బలూచిస్థాన్‌లో ఐ ఎస్ బలంగా వేళ్లూనుకుందని చెప్పింది.గత ఏడాది చైనా జాతీయుడి అపహరణ హత్యలో ఐఎస్ హస్తం ఉందని కూడా ఆ సంస్థ తెలిపింది. నివేదికలోని విషయాలను డాన్ న్యూస్ బయటపెట్టింది. ‘2017 ప్రత్యేక నివేదిక’ పేరిట పిఐపిఎస్ పాకిస్థాన్‌లో భద్రతా సవాళ్ల గురించి వివరించింది. ఆ ఏడాది జరిగిన దాడుల్లో 58 శాతం తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) సాగించగా, 37 శాతం జాతీయ తిరుగుబాటు గ్రూపులు, 5 శాతం దాడులను తెగల బృందాలు సాగించినట్లు తెలిపింది.
వేరే మార్గంలో ఉగ్ర స్థావరాలు ఖతం : పాకిస్థాన్‌ను టెర్రరిస్టుల స్వర్గథామం కాకుండా చేయడానికి వేరే విధమైన ప్రయత్నాలు చేయడానికి ఇది తరుణమని ట్రంప్ పాలనా యంత్రాంగం భావిస్తోంది. ఓరిమి వహించడం,ఉగ్రస్థావరాలపైచర్యలకు ప్రేరేపించడం ప్రయత్నాలు వర్థమయ్యాయి కాబట్టి ఈ సమస్యతో ఇక వేరే విధంగా వ్యవహరించాలని అమెరికా ఉన్నత స్థాయి అధికార్లు సోమవారం నాడు అన్నారు. దాదాపు రెండు బిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని ట్రంప్ పాలనా యంత్రాంగం నిలిపివేసిన తర్వాత వెలువడిన ప్రకటన ఇది. ఈ నిలిపివేతపై పాకిస్థాన్ తీవ్ర విమర్శలు గుప్పిం చింది. గత 15 ఏళ్లుగా 33 బిలియన్ డాలర్ల సహా యాన్ని తమ నుంచి అందుకున్న పాకిస్థాన్ బదులుగా ఇచ్చినది అబద్ధాలు, దగా మాత్రమేనని, పైగా ఉగ్రవాద స్థావరాలకు భద్రమైన ఆశ్రయంగా తన భూభాగంగా మార్చిందని కూడా ట్రంప్ ఇటీవల నూతన సంవత్సర ట్వీట్‌లో విమర్శించారు. న్యూయార్క్ జంట భవనాల కూల్చివేత దుర్ఘటన అనంతరం అమెరికా ప్రభుత్వం పాక్‌పట్ల చేపట్టిన ప్రతి చర్యలు ఏవీ ఫలించలేదని తాజా ప్రకటనలో అమెరికా అధికార్లు పేర్కొన్నారు.

Comments

comments