Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

కారేగాం ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

spమనతెలంగాణ/పిట్లం: పిట్లం మండలం కారెగాం కాకివాగు వద్ద గత బుధవారం అర్ధరాత్రి జరిగిన ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన విఆర్‌ఎ సాయిలుపై  శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘటన స్థలం ఇరువైపులా గల వ్యవసాయ రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కారెగాం గ్రామ ఘటనపై పిట్లంకు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు. పూర్తి సమాచారం జిల్లా కేంద్రంలో తెలియపరుస్తామని పేర్కొన్నారు. వీరి వెంట ఆర్డిఓ రాజేశ్వర్, డిఎస్పీ నర్సింహరావు, సిఐ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ కోదండరాంరెడ్డి, ఎస్సై అంతిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Comments

comments