Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ….

JUDGE

ఢిల్లీ : స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్యామానికి మనుగడ ఉండదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. న్యాయ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు మీడియాతో మాట్లాడడం సంచలనమైంది. ఒకేసారి నలుగురు జడ్జిలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో పాటు జడ్జిలు రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై జడ్జిలు అసంతృప్తి వ్యక్తంచేశారు. భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇదని చలమేశ్వర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదని, సుప్రీంకోర్టులో గతకొంతకాలంగా అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థను సరిదిద్దాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని కోరామని, కానీ ఆయన్ను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని, ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చినట్టు చలమేశ్వర్ తెలిపారు.

Justice Chelameswar Comments on Supreme Court

Comments

comments