Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోతిక

JYOTHIKA

చెన్నయ్ : ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌గా రాణించిన జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమయ్యారు. 36 వయోదినిలే చిత్రంతో ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బాల దర్శకత్వంలో నాచియార్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఉండనుంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. జ్యోతిక అవతారం, ఆమె పలికిన డైలాగ్‌లు నాచియార్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో జ్యోతి లుక్ , ఆమె నటన, యాటిట్యూడ్ అన్నీ సంచలనం రేపేలా ఉన్నాయి. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న నాచియార్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Jyothika act as Powerful Police Officer in Naachiyaar film

Comments

comments