Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆ విషయంలో కొంచెం తగ్గింది

kajal

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడమంటే చాలా కష్టమైన పని. యంగ్ హీరోయిన్‌ల నుంచి పోటీ ఎక్కువైపోవడంతో సీనియర్ హీరోయిన్‌లు కొంచెం భయపడిపోతున్నారు. కానీ సీనియర్ స్టార్ కాజల్ మాత్రం గత కొన్నేళ్లుగా సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమాలు చేసేస్తోంది. అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరితో నటించింది. ప్రస్తుతం ఈ భామ కళ్యాణ్‌రామ్ ‘ఎంఎల్‌ఎ’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్‌లో ‘పారిస్ పారిస్’ సినిమా చేస్తోంది. ఆ సినిమా బాలీవుడ్ ‘క్వీన్’ చిత్రానికి రీమేక్. అయితే కాజల్ మొన్నటి వరకు సినిమా ఏదై నా సరే రెమ్యునరేషన్ విషయంలో తేడా రానిచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆ విషయంలో ఆమె కొంచెం తగ్గింది. కొంచెం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ఓకే అయింది. అలాగే వెంకటేష్-తేజ కాంబినేషన్‌లో వస్తున్న మూ వీలో కూడా నటించడానికి కాజల్ సరేనంది. ఈ సినిమాలు కొంచెం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కేవే కాబట్టి రెమ్యునరేషన్ తక్కువగా తీసుకోందట కాజల్. రాబోయే రోజుల్లో ఈ భామ యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తుందట.

Comments

comments