Search
Saturday 21 April 2018
  • :
  • :

ఐటి కంపెనీలకు నిలయంగా కరీంనగర్

ktr

 కరీంనగర్‌లో సోమవారం ఉజ్వల పార్కు వద్ద 25కోట్లతో మంజూరైన ఐటి పార్కుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వినోద్ కుమార్‌తో కలిసి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌లో ఐటి టవర్ శంకుస్థాపన మొదటి రోజే 1000 మందికి ఉద్యోగాలు కల్పించుటకు బీజం పడిందని ఇంకను వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వ స్తున్నాయని తెలిపారు. జిల్లాలో మరో ఐటి పార్కుకు స్థలం కేటాయిస్తే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఐటి రంగంలోనే ఉ ద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణలో యువశక్తి అతిపెద్ద వనరుగా ఉందని వారందరికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.  

మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది కరీంనగర్‌కు మరో ఐటి టవర్ మంజూరు
విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుంది తెలంగాణ ఐటి హబ్‌ను కూడా మంజూరు చేస్తాం
ప్రతి విద్యార్థి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్,ఆర్థిక మంత్రి ఈటెల

రాష్ట్ర ఐటి శాఖ మంత్రులు కెటిఆర్,ఈటెల
కరీంనగర్‌ప్రతినిధి: కరీంనగర్‌కు మరో ఐటి టవర్ మంజూరు చేస్తానని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సోమవారం ఉజ్వల పార్కు వద్ద 25కోట్లతో మంజూరైన ఐటి పార్కుకు రాష్ట్ర ఆర్థి క శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వినోద్ కుమార్‌తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కరీంనగర్‌లో ఐటి టవర్ శంకుస్థాపన మొదటి రోజే 1000 మం దికి ఉద్యోగాలు కల్పించుటకు బీజం పడిందని ఇంకను వి విధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపా రు. అందుకే మరో 1000 మందికి ఎక్కువ ఉద్యోగాలు క ల్పించుటకు జిల్లాలో మరో ఐటి పార్కుకు స్థలం కేటాయిస్తే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో యువశక్తి అతిపెద్ద వనరుగా ఉందని వారందరికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్ర భుత్వంపై ఉందన్నారు.ఐటి రంగంలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భారతదేశంలో జనాభాలో 50 శాతం27సంవత్సరాల వయస్సు గల వారు, 65 శాతం 35 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారని తెలిపారు. ప్ర పంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు వివిధ దేశాలలో పనిచేస్తున్నారని,ప్రపంచంలోనే టాప్-100 కంపెనీలను మన తె లంగాణ ప్రజలే నడిపిస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటులో నెం.1 స్థానంలో ఉన్నామని తెలిపారు. జిడిపిలో కూడా తెలంగాణ రాష్ట్రం డబుల్ ఉందని అన్నా రు.2014లో ఐటి రంగంలో పెట్టుబడి 56 వేల కోట్లు ఉం టే, 2017 లో 87 వేల కోట్లకు చేరిందన్నారు. ఇంతవరకు ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. క రీంనగర్‌లో తెలంగాణ అకాడమి స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంట ర్లు, తెలంగాణ ఐటి హబ్‌ను కూడా మంజూరు చేస్తామని అన్నారు.దీని ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణతో నైపుణ్యం పెంపొందుతుందని తద్వారా ప్రపంచంలో ఉన్న వారందరితో మన పిల్లలు పోటీపడి నెగ్గి ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటివి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవీన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు జాబ్ క్రియేటర్లుగా ఎదుగుతారని అన్నారు. ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ఉద్యమంతో తెలంగాణను సాధించుకున్నారని అ న్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాలు విడిపోతే కరెంటు ఉండదని రాష్ట్ర అంధకరాం అవుతుందని కొత్తగా పెట్టుబడులు రావని, వీరికి రాజకీయ అనుభవం లేదని ఎంతో మంది ఎ గతాళి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మూడున్నర సంవత్సరాలలో దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయిం గ్ నెం.1 స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. మూడున్నర సంవత్సరాలలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. ఆడబిడ్డలు బిందెలతో రోడ్డుపైకి రాకూడదని ఉద్దేశ్యంతో మి షన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు త్వరలో అందస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చుటకు ప్రభుత్వం వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్షంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని, అసాధ్యాన్ని సు సాధ్యం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. రోడ్ల నిర్మా ణం చేస్తున్నామని, కెసిఆర్ ప్రాజెక్టు ద్వారా 250కోట్లతో క రీంనగర్ అభివృద్ధ్ధికి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపా రు. కరీంనగర్‌లోని భూగర్బ డైనేజిని వచ్చే ఎండాకాలంలో గా పూర్తి చేస్తామని అన్నారు. కరీంనగర్‌లో మహిళా ఉద్యోగుల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు ఉత్తమ శిక్షణతో ప్రపంచస్థాయి ఉద్యోగ పోటీలలో నెగ్గి ఉద్యోగాలను అందిపుచ్చుకొనుటకు కరీంనగర్ వి ద్యార్థులు సిద్ధంగా ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. రా ష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హై దరాబాద్ తర్వాత కరీంనగర్ పెద్ద ఐటి కంపెనీలకు నిల యం కావాలని అన్నారు. తెలంగాణ విద్యార్థులందరూ తె లంగాణ ఆస్తి అని అన్నారు. మూడున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే గొప్ప రాష్ట్రంగా చరిత్రకెక్కిందని అన్నారు. 95 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రం గంలో ఉన్నాయని అన్నారు. మారుతున్న సమాజంలో ప్రతి విద్యార్థి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుటకు రాష్ట్ర ప్రభుత్వం చాలా గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులకు పేదరికం శాపం కాకూడదని వారి విజ్ఞానమే వారి ఆస్తి కావాలని ఉద్దేశ్యంతో విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. సంకల్పం ఉంటే సాధించలేదని ఏది లేదని, గొప్ప భావిభారత పౌరులుగా ఎదుగుటకు ల క్షాలను ఎన్నుకోవాలని సూచించారు. ఆస్ట్రేలియా తరహా లో కరీంనగర్‌లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నా రు.కరీంనగర్‌ను హైదరాబాద్ తర్వాత అతిగొప్ప జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నీ రు ఇచ్చే జిల్లా కరీంనగర్ అని, కరీంనగర్ అభివృద్ధికి ము ఖ్యమంత్రి ప్రేమతో ఎన్ని కోట్లైనా మంజూరు చేస్తారని అ న్నారు. పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఐటి వైపు పరుగుతీస్తున్న సమయంలో కరీంనగర్‌లో ఐటి టవర్ ఏర్పాటు చేసి కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. మరిన్ని ఐటి కంపెనీలను కరీంనగర్‌కు ఆహ్వానించుటకు వచ్చే ఫిబ్రవరిలో శాసన సభ్యులు గంగుల కమలాకర్‌తో కలిసి అమెరికాకు వెళుచున్నామని తెలిపారు. అక్కడ స్థిరపడ్డ తెలంగాణ ఐటి కంపెనీలను కరీంనగర్‌కు ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ లో ఐటి టవర్ నిర్మిస్తామని ఇచ్చిన హామీని నేడు అమలు పరిచామని అన్నారు. తెలంగాణలోని రైతాంగానికి కోటి ఎకరాలకు నీరు అందించుటకు కృషి చేస్తున్నామని అన్నా రు. తెలంగాణ బిడ్డలు అంటే అన్నింట్లో ముందున్నారని మీ తరం వారు కూడా ప్రపంచంలో ముందుండాలని అన్నారు. బాగా చదువుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో మీ పా త్ర ఉండాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసన సభ్యు లు గంగుల కమలాకర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర సాం స్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు, భాను ప్రసాద్ రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఇన్ చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ కుమార్, టిఎస్‌ఐటి అధ్యక్షు లు బాల మల్లయ్య, ఎండి నర్సింహారెడ్డి, నగర మేయర్ స ర్ధార్ రవీందర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ శశాంక, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీంద ర్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments