Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌పై పోటీ చేయడమే నేరమా ?

kcr-vs-Pratap-reddy

మన తెలంగాణ/బాలాపూ ర్ : తెలుగు దేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి గత ఎ న్నికల్లో గజ్వేల్ నియోజక ర్గం నుంచి తెలుగు దేశం అ భ్యర్థిగా పోటీ చేయడమే నే రం అయిందా…? అని బాలాపూర్ మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ప్రశ్నించారు. శనివారం మీర్‌పేట్ తెలుగు దేశం పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ప్రతాప్‌రెడ్డి భేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గజ్వేల్ నియోజకర్గానికి చెందిన విద్యావంతుడైన నిరుద్యోగ యువకుడు మురళీ తెలంగాణా వచ్చిన ఉద్యోగాలు రావడంలేదని మనస్తాపంతో యూస్మానియాలో ఆత్మహత్య చేసుకుంటే, మురళీ మృతదేహన్ని దగ్గరుండి మృతుడి స్వంత గ్రామానికి తరలించడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో నిజాంల పాలన కొనసాగుతుందన్నారు.

ప్రశ్నించే గొంతులను కొక్కేస్తు ఇష్టారాజ్యంగా అరెస్ట్‌లు, ఆపై జైళ్లకు తరలిస్తున్నారని ఎడ్ల ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగా చేసిన తప్పు ఎంటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతాప్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాదర్‌గూల్ ‘దేశం’ అధ్యక్షులు జెనిగే క్రిష్ణయాదవ్, నాయకులు బి.కొ మరేష్, గడ్డం శ్రీనివాస్, ఐ.సుందరామయ్య, డి.రమేష్‌బాబు, శ్రీనివాస్, భూతం రాజు, ఎన్.శివ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments