Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

సర్పంచ్ ఎన్నికల వాయిదాకు కెసిఆర్ కుట్ర

old

* రెండు లక్షల రుణ మాఫీ మరో బోగస్ వాగ్దానం
* బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి

మనతెలంగాణ / నాగర్‌కర్నూల్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాని కి  ముఖ్యమంత్రి కెసిఆర్ పథకం పన్నుతున్నాడని,  ఆయన తాజాగా ప్రకటించిన రెండు లక్షల రుణ మాఫీ మరో బోగస్ పథకమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  టిఆర్ ఎస్‌ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు రాష్ట్రం నుండి ఒక్క రూపాయి కూడా కెటాయించలేదని ,కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన 12వ ఆర్థిక ప్రణాళిక నిధులు కూడా సాఫీగా వినియోగించకుండా ఫ్రీజింగ్ విధుస్తున్నాడని నాగం ఆరోపించారు.  స్థానిక సంస్థల బలోపేతం, అధికారాలను దెబ్బతీసే విధంగా అవినీతి బేరసారాలు పెంచే విధంగా సర్పంచ్‌కు ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక నిర్వహించేందుకు కెసిఆర్  ప్రయత్నిస్తున్నాడని ఇది గ్రామ పంచాయతీలలో అస్థిరతను సృష్టించనున్నదని అన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ధైర్యం చాలని  కెసిఆర్   ఆర్టికల్ 23కు వ్యతిరేకంగా చట్ట సవరణ చేసి  దానిపై కేసులు వేయించి ఎన్నికలు వాయిదా వేయించే కుట్ర చేస్తున్నాడని కూడా నాగం ఆరోపించారు. ఎన్నికలహామీలో ప్రక టించిన లక్ష రూపాయల రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైం దని , ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ పాస్ పుస్తకాలు చేతికి రాలేదని అన్నారు. కొత్త గా రుణ మాఫీ ప్రకటించి మరో బోగస్ వాగ్దానానికి తెరలేపుతున్నారని అన్నారు. కెసిఆర్ మహిళా సంఘాలను  నిర్వీర్యం చేస్తున్నారని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పావలా వడ్డీ మంజూరి చేశారని ఆతర్వాత ఇప్పటివరకు దిక్కులేదని నాగం ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్డానాలు అమలు చేయకుండా పీర్ల పండుగరోజు బొణుగులు బెల్లం పంచినట్లు ఏఓ కొత్త తాయిలాలు ప్రకటించి ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్ని స్తున్నారని  విమర్శించారు. కెసిఆర్ కుటుంభం అంత రాజకీయ అవినీతి కుటుంభం దేశంలో నే ఎక్కడాలేదని అన్నారు. విలేకరుల సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాములు, బిజెపి  ప్రదాన కార్యదర్శి అర్ధం రవి,ఉపాధ్యక్షులు కాశన్న ,నసీర్ లక్ష్మినారాయణ,కొట్రది నేష్,మన్నెపు రెడ్డి, అర్జునయ్య తదితరులుపాల్గొన్నారు.

Comments

comments