Search
Friday 20 April 2018
  • :
  • :

కిలో బంగారం, రూ.4 లక్షలు చోరీ

theft

అమరావతి: కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని రవీంద్ర స్కూల్ వెనుకనున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న కిలో బంగారం, 4 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి యజమాని శ్రీదేవి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఈ చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళం తెరిచి ఉండటం పక్కింటివారు గర్తించడంతో చోరీ జరిగిన విషయం వెలుగుచూసింది. దొంగలు బంగారంతోపాటు పిల్లల ఫీజు కోసం దాచిన నగదును దొంగలించారని శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments