Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఒలింపిక్స్‌కు ఉ.కొరియా క్రీడాకారులు

 uttara

ఉభయకొరియాల చర్చల్లో అవగాహన

సియోల్ : రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి ఉభయకొరియాల మధ్య అధికారిక చర్చలు మంగళవారం జరిగాయి. ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యకలాపాల వల్ల కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత జరిగిన చర్చలు ఇవి. రానున్న శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటామని ఉత్తరకొరియా ఈ చర్చల్లో పునరుద్ఘాటించింది. దక్షిణకొరియాలో ఈ నెల ఈ క్రీడోత్సవం జరగనుంది. ఇరుదేశాల చర్చలు పాన్‌మున్‌జోన్ అనే నిరస్త్రీకరణ మండలంలోని గ్రామంలో జరిగాయి. 195053లో కొరియాల యుద్ధం తరుణంలో విడిపోయిన కుటుంబాలను తిరిగి కలపాలని దక్షిణకొరియా ఈ చర్చల్లో విజ్ఞప్తి చేసింది. ఒలింపిక్స్ క్రీడోత్సవం సమయంలోనే ఆ కుటుంబాలు తిరిగి కలుసుకోవడం జరగాలన్నది దక్షిణ కొరియా ప్రతిపాదన. క్రీడోత్సవానికి ఉత్తరకొరియా ఉన్నతస్థాయి ప్రతినిధివర్గాన్ని , పలువురు క్రీడాకారులను పంపడానికి సంసిద్ధత ప్రకటించింది. ఈ చర్చలు జరిగిన గ్రామం ఉభయకొరియాల సరిహద్దుల్లో ఉంది. సైనిక విభజన రేఖ వద్దకు ఉత్తర కొరియా ప్రతినిధివర్గం చేరుకుంది. అక్కడ ఉన్న ‘శాంతిగృహం ’ వద్దకు చర్చల కోసం చేరుకుంది. అది దక్షిణ కొరియా వైపు ఉన్న భవనం. కొరియాల ఏకీకరణ వ్యవహారాల దక్షిణకొరియా మంత్రి చో ఎం యుంగ్ గియాన్, ఉత్తర కొరియా ప్రతినిధివర్గం సారథి రీసన్ గ్వోన్ కరచాలనం చేసుకొని చర్చలకు నాంది పలికారు. చర్చలకు ముందు వారు రెండోసారి చేతులు కలిపారు. ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో ఇరుదేశాల జట్లు కలిసి నడవాలని దక్షిణ కొరియా సూచించింది. ఈ క్రీడోత్సవానికి ‘శాంతి ఒలింపిక్స్ ’ అని పేరు పెట్టారు. అనుకోకుండా ఘర్షణలు ఏవీ తలెత్తకుండా సైనికపరమైన కట్టుదిట్టలు చేయాలని, దానిపైన, రెడ్‌క్రాస్‌పైన చర్చలు జరపాలని కూడా సియోల్ సూచించింది. ఉత్తరకొరియా నేత రీ నూతన సంవత్సర శుభాకాంక్షలను దక్షిణకొరియాకు తెలిపారు.

Comments

comments