Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

ఐటి టవర్‌కు కెటిఆర్ శంకుస్థాపన

KTR

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు ప్రాజెక్టు సమీపంలో ఉనేన ఉజ్వల పార్క్ వద్ద ఐటి టవర్ నిర్మానానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్, ఎంఎల్‌ఎలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని గత పాలకులు బెదిరించారని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం మిగులు విద్యుత్‌ను చూపించిందని ఆయన తెలిపారు. ఆర్థిక వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఐటి ఉత్పత్తులను ఐదేళ్లలో రెట్టింపు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఐటి రంగంలో మూడేళ్లలోనే లక్ష వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా దక్కించుకుంది. ఇప్పుడు ఐటి పరిశ్రమల స్థాపనతో ప్రపంచస్థాయి గుర్తింపు అందుకోనుంది. రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఐటి టవర్ నిర్మాణంతో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

KTR foundation for IT Tower

Comments

comments