Search
Sunday 21 January 2018
  • :
  • :

రికార్డుస్థాయిలో భూసేకరణ

hall

సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకటరామిరెడ్డి

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి : దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట జిల్లాలో రికార్డు స్థాయిలో భూసేకరణ కార్యక్రమం జరుగుతున్నదని కలెక్టర్ వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బెజ్జంకి మండలం గుండారం, కల్లేపల్లి, వడ్లూరి బేగంపేట గ్రామస్థులతో కాల్వల భూసేకరణపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజక్టులోని అంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలోని 10వ ప్యాకేజీ కెనాల్ డీ-7 డిస్ట్రీబ్యూటరీలో భాగంగా బెజ్జంకి మండలంలోని గ్రామాలకు సంబంధించి దాదాపు 46  ఎకరాల భూమిని సేకరించడానికి సంబంధించి అధికారులతో, గ్రామస్థులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కాల్వల నిర్మాణం వల్ల నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని తెలిపారు. గుండారం, కల్లేపల్లి, వడ్లూరి బేగంపేట గ్రామస్థులతో మాట్లాడి భూసేకరణకు ఒప్పించారు. రైతుల శ్రేయస్సు కోరి సాగునీటి ప్రాజక్టు నిర్మాణానికి అధిక ప్రాథాన్యత ఇస్తున్నామని పరిమితి లోపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని జలాశయాలు ఉన్నచోట ప్రజలు, రైతులు కూడా సహకరిస్తున్నారన్నారు. జిల్లాలోని 400 గ్రామాలకుగాను 270 గ్రామాల్లో జలాశయాల భూసేకరణ చేపడుతున్నట్టు వివరించారు. ఇప్పటిదాకా జిల్లాలో 40వేల ఎకరాల భూసేకరణ జరిపామని, ఇంకా 10,530 ఎకరాలు సేకరించాల్సి వుందని  తెలిపారు. జిల్లాలోని పరిస్థితులను గమనించి సహకరించాలని, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తాను స్వయంగా రైతు బిడ్డనేనని మీ బాధలు తనకు తెలుసనని మీ ఇ ష్టపూర్వకంగా భూసేకరణ జరిగేవిధంగా చూస్తున్నానని చెప్పారు. రైతులను ఒప్పించి భూసేకరణ జరిపితేనే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులతో తానే స్వయంగా మాట్లాడుతున్నానని, ప్రజా ప్రయోజనార్థం రైతులు సహకరిస్తే లాభం చేకూరుతుందని తెలిపారు. రైతుల కు వారం రోజుల లోపు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెసి పద్మాకర్, తహశీల్దారు శ్రీనివాస్, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments