Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భూసేకరణకు కరసత్తు

fields
*జిల్లాలో రూ.19 కోట్లతో 270 ఎకరాల భూమి కొనుగోలు
*భూమి విలువను బట్టి ఎకరానికి రూ.2 నుండి రూ.7 లక్షలు చెల్లిస్తాం
*అమ్మదల్చుకున్న పట్టాదారులు వెంటనే తహసీల్దార్ ను సంప్రదించాలి
*జిల్లా ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

మన తెలంగాణ /మెదక్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హా మీని నెరవేర్చుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు గాను దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేసేందుకు జిల్లాలో 270 ఎకరాల భూమిని సుమారు 19 కోట్ల రూపాయలతో కొనుగో లు చేయనున్నట్లు జిల్లా షెడ్యూలు కులముల సేవా సహకార అభివృధ్ధి వారు ప్రకటించారు. ఇందుకు గాను ఒకేచోట 6 ఎకరాలకు పైబడి ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయనున్న భూమి విలువ ప్రభుత్వ నిబంధనలు, మార్కెట్ రేటును పరిశీలించి ఎకరానికి 2 నుండి 7 లక్షల రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేయబడునని తెలిపారు. ఇట్టి కొనుగోలు చేసిన భూమిని ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా భూమిలేని దళిత నిరుపేదలకు అందజేయబడుతుందన్నారు. జిల్లాలో భూ మి కలిగి ఉన్న పట్టాదారులు వారు తమ భూములను ప్రభుత్వానికి అమ్మకోదలిచిన వారు వారి యొక్క పూర్తి సమ్మతిని తెలుపుతూ పట్టాదారు పాసుపుస్తకము జిరా క్స్ ప్రతులను సంబంధిత మండల తహసీల్దార్‌లకు లేదా మె దక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌సి కార్పొరేషన్ కు అందజేయవల్సిందిగా కోరారు. విక్రయించదలచిన భూ ములను పరిశీలించి సాగులో ఉండి నీటివనరులు ఉన్న భూములకు ఎక్కువ ప్రా ధాన్యత ఇవ్వబడుతూ, నీటి వసతి లేని భూములను కూ డా కొనబడునని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి భూమిని విక్రయించనున్న పట్టాదారునకు ఆస్తిపన్ను మినహాయింపు కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ కొనుగోలులో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకోబడదని తెలిపారు. కావున భూములు అమ్మే పట్టాదారులు వెంటనే సంబంధిత అధికారులను లేదా lplds.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. భూ విక్ర యం కోరకు ఏవైనా సందేహాలుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌సి కార్పొరేషన్‌ను (ఫోన్. 9849905994)ను సం ప్రదించగలరని తెలియజేశారు. జిల్లాలో భూ విక్రయదారులు అసలైన పట్టాదారులై ఉండి ప్రభుత్వానికి అమ్మదల్చుకున్న వారు అధికారులను సంప్రదించవల్సింగా ఎస్‌సి కార్పొరేష న్ వారు కోరారు.

Comments

comments