Search
Saturday 21 April 2018
  • :
  • :

ఎల్‌ఎండి నీటిని దిగువకు విడుదల

dam

2500 క్యూసెక్కులు ఆన్ ఆఫ్ పద్ధతిలో
విడుదల
సిఎం అదేశాల మేరకు కరీంనగర్‌కు
సాగునీరు,వరంగల్‌కు తాగునీరు
ఏప్రిల్ వరకు ఆన్ ఆఫ్ ద్వారా నీటి విడుదల
చివరి ఆయకట్టు వరకు సాగునీరు
నీటిని వృథాగా పోనివద్దు : మంత్రి ఈటెల

మనతెలంగాణ/తిమ్మాపూర్: లోయర్ మానేర్ డ్యాం ను ంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు బుధవారం ఎంపి వినోద్ కుమార్,ఎంఎల్‌ఏలు గంగుల,రసమయి, జడ్‌పి చై ర్ మెన్ తుల ఉమ ,ఎంఎల్‌సి నారదాస్ లక్ష్మణ్‌రావు కలిసి మంత్రి ఈటెల రాజేందర్ దిగువకు నీటిని విడుదల చేశా రు.ఎల్‌ఎండి నుంచి హెడ్ రెగ్యులేటరీ వద్ద కాకతీయ కా లువకు రోజుకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, దానిని రాత్రి వరకు 2500 క్యూసెక్కులకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా రైతులకు సాగు, వరంగల్ జిల్లా ప్రజలు తాగునీటి అవసరాలకు నీ టినివిడుదల చేస్తున్నట్లు చెప్పారు.రోజుకు 2500 క్యూసె క్కుల చొప్పున ఏప్రిల్ వరకు ఆన్ ఆఫ్ పద్ధతిలో విడు దల చేస్తామని పేర్కొన్నారు. ఎల్ ఎండి దిగువన పంటలు వే సుకున్న రైతులు నీటిని పొదుపుగా వాడాలని మంత్రి ఈటె ల సూచించారు. ఎల్‌ఎండి నీటిని మొదటి నుంచి చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతులకు అందిస్తామని అన్నారు. ప్రస్తుతంఎస్సారెస్పిలో14టియంసి నీరు నిల్వ ఉండగా 2500 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందన్నారు. వర్షాకాల ంలో రైతులు వేసిన పంటలకు దోమ పోటు వచ్చి చాలా నష్టపోయారని దానిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రైతులు ఆరు తడి పంటలు ఎక్కువగా వేసుకోవాలని అన్నారు. వరంగల్ ప్రజలకు తా గునీటిని,కరీంనగర్ ప్రజలకు మాత్రం సాగునీరు ఇస్తు న్నట్లు చెప్పారు.ఎస్సారెస్పి ప్రాజెక్టులో సరి పోనన్ని నీళ్లు లే కున్నా జిల్లా ఎంఎల్‌ఏలు పట్టుపట్టి సిఎం కేసిఆర్ కు వి వరించి మంజీరా, సింగూర్ నిజాం సాగర్ ప్రాజెక్టులోనే ఉన్న నీటిని ఎస్సారెస్పికి తెచ్చుకొని అక్కడి నుంచి ఎల్ ఎండికి విడుదల చేశామన్నారు. డిబిఎం 24 కాలువ వర కు దిగువకు ఇవ్వాలని, ఎగువకు నాలుగున్నర లక్షల ఎక రాలకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో గత నెల 25న ఎల్‌ఎండి కి నీటిని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజున దిగువకు నీటినివిడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సిఈ శంకర్ ,ఎస్సారెస్పి అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ఈటెలకు ఘన స్వాగతం
మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల ఎస్సారెస్పి అతిథి గృహానికి మంత్రి ఈటెల రాజెందర్ రావడంతో స్థానిక మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛం అ ందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నా యకులు ఉల్లెంగుల ఏకానందం, ఎడ్ల జోగిరెడ్డి ,మాతంగి లక్ష్మన్ ,చిందం కిష్టయ్య, పొన్నాల సంపత్, తదితరులు ఉన్నారు.

Comments

comments