Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

చంపేస్తున్న ప్రేమ!

ఐదు మాసాల్లో నలుగురు యువతులు బలి
తెలిసీ తెలియని ప్రాయం,

ప్రాశ్చాత్య సంస్కృతి ప్రభావం

విచక్షణను కోల్పోతున్న వైనం విధించడం జరిగింది

love

మన తెలంగాణ/సిటీబ్యూరో : తెలిసీ తెలియని వయస్సు… ప్రాశ్చాత్య సంస్కృతి ప్రభావం… సామాజిక మాధ్యమాల అలవా టు… నగరంలోని యువతను ఉ న్మాదులను చేస్తున్నాయి. ప్రేమనే ముసుగులో అమాయక యవతుల హత్యకు కారణమవుతున్నా యి. విశ్వనగరంగా అభివృద్ధి చెం దుతున్న హైదరాబాద్‌లో ఈ తర హా నేరాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. చాందినీ జైన్, సౌ మ్య, సంధ్యారాణి, జానకీలు ఇలా అభం శుభం తెలియని, లోకమ ంటే ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్న యువతులు ప్రేమచాటున దాగిఉన్న కర్కశత్వానికి బలిఅవుతున్నారు. ఆధునిక జీవన పోకడలు, యాంత్రిక జీవనంలోని పద్ధతులు యువతీయువకుల భవిష్యత్ మార్గాలను దారిమళ్ళిస్తున్నాయి. ఆక్రమంలోనే యువతీయువకులు గర్ల్‌ఫ్రెండ్‌ని, బాయ్‌ఫ్రెండ్‌ని స్టేటస్‌గా చెప్పుకోవడానికి పెద్దపీటవేస్తున్నారు. యువకులు తన గర్ల్ ఫ్రెండ్ పలకరింపులను, పరిచయాన్ని, స్నేహభావాలను, కలిసి తిరగడాన్ని ప్రేమనే ఊహల్లో విహరిస్తున్నారు. కానీ, ఆమె తన అభిప్రాయంతో ఏకీభవిస్తారా…? వ్యతిరేకిస్తారా…? అనేది పరిగణలోకి తీసుకోవడంలేదు. తన భావాన్ని, అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చాలు విచక్షణను కోల్పోతున్నారు. ఉన్మాదులుగా మారిపోతున్నారు. ఆమె తిరస్కరించడాన్ని భరించలేకపోతున్నారు. మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో యువతులపై, బాలికలపై కక్షపెంచుకుంటున్నారు. హతమారుస్తున్నారు. హంతకులుగా మారుతున్నారు.

ప్రేమచాటున హత్యలు : గత ఐదు మాసాల్లోనే చాందినీ జైన్, సౌమ్య, సంధ్యారాణి, జానకీ అనే నలుగురు యువతులు ప్రేమికులంటూ చెప్పుకునే విక్షణ కోల్పోయిన యువకుల చేతుల్లో ప్రాణాలను కోల్పోయారు. వీరిని హతమార్చిన యువకుల వయస్సు మహా అంటే 22 ఏళ్ళు దాటలేదు. వీరిలో ఒకరు తనతో మాట్లాడుతూనే మరొకరితో సన్నిహితంగా ఉన్నారనే కోపంతో ప్రణాళికా ప్రకారంగా హత్యచేసి శవాన్ని చెరువులో వేశాడు. మరొకరు తనను పెళ్ళిచేసుకోవాలని వెంటపడుతున్నందున ఆమెను తప్పించుకునేందుకు హత్యచేశాడు. తనతో ఇంతకాలం పరిచయంగా ఉండి, స్నేహంగా తిరిగి ఇప్పుడు తాను చెప్పిన ప్రేమను తిరస్కరించారని యువతిని పెట్రోలుపోసి కాల్చి హత్యచేశాడు. ఇలా వరుసగా నగరంలోని యువకులు క్షణికావేశంలో జీవితాంతం బాధపడే నిర్ణయాలు తీసుకుని రెండు కుటుంబాలకు తీరని దు:ఖాన్ని మిగిల్చుతున్నారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటున్నారు.

ప్రాశ్చాత్య పోకడలే : నగర యువతపై ప్రాశ్చాత్య సంస్కృతి ప్రభావం విపరీతంగా ఉంటుందనేది బహిరంగ రహాస్యం. ముఖ్యంగా యువకుల్లో దుస్తులు ధరించడంలో, తల వెంట్రుకల కటింగ్‌లో, టాటూన్స్, వేషధారణ, అలంకరణ, మోటార్‌సైకిళ్లు నడపడం, పొగత్రాగడం, సినిమాలు, హోటళ్ళు, మాల్స్ ఇలా విదేశీ పోకడలతోనే యువత కాలాన్ని సంతోషమనే ఆలోచనల్లో గడిపేస్తుంది. ఇంటర్‌చదివే స్థాయి వచ్చేసరికి బాయ్, గర్ల్ ఫ్రెండ్ ఉండాలనేది వారిలో నాటుకుపోతున్నది. తోటివారి ముందు తమకు స్నేహితులున్నారని గొప్పగా భావించుకోవడమే వారిలో సున్నితమైన విషయాలకు తావులేకుండా చేస్తున్నట్టు పలువురు మన:శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వీరిపై సాంకేతిక వ్యవస్థ ప్రభావం, సామాజిక మాధ్యమాల్లోని అలవాట్లు, సినిమాల దృశ్యాలు యువత మనస్సును కల్లోలం చేస్తున్నట్టు మేథావులు వెల్లడిస్తున్నారు.

స్నేహాలకు దూరంగా : ముఖ్యంగా యువతీ యువకులు ఆలోచింపజేసే మేథస్సు వచ్చే వరకు స్నేహంపేరుతో నిత్యం కలిసే దోరణికి దూరంగా ఉండాలి. పరిచయస్థులుగా పలకరింపులకే పరిమితం కావాలి. సన్నిహితంగా మెలిగే అవకాశాలు రానివ్వకుండా చూసుకోవాలి. యువతీ యువకులు కలిసి తిరిగే పద్దతిని విడనాడాలి. ప్రేమనే ప్రస్తావన వచ్చేసరికి సున్నితంగా దూరంచేయాలి. ప్రేమనే తమ అభిప్రాయాన్ని వెల్లడించగానే ఒకేమారు వ్యతిరేకించడం, తిరస్కరించడం, మాట్లాడటాన్ని మానుకోవడం వంటివి వెంటనే నిర్ణయం తీసుకోరాదు. తన మనస్సులో అలాంటి యోచన లేదనేది తెలిసేట్టుగా చేయాలి. తోటివారి రెచ్చగొట్టే విధానాలకు, చెప్పేమాటలకు, కథలకు, కల్పితాలకు ప్రభావితం కారాదు. దీంతో ఈ రకమైన హత్యలకు దూరం కావచ్చనేది సైకాలిజిస్టుల అభిప్రాయం.

Comments

comments