Search
Friday 20 April 2018
  • :
  • :

అనుమానం పెనుభూతమై…

భార్య, కుమారున్ని హతమార్చిన భర్త

Murder

మన తెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధి 2017 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ సంబురాలు జరుపుకుంటుండగా ఓ భర్త కత్తితో గొంతు కోసి భార్య, ఆరు నెలల కుమారున్ని కడతేర్చిన సంఘటన విషాదం నింపింది. తాగిన మైకంలో కుటుంబ కలహాల కారణంగా చిన్నపాటి గొడవతో ఉద్వేగానికి గురై భార్య, కుమారున్ని హతమార్చి పారిపోయాడు. ఈ సంఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. విద్యానగర్‌కు చెందిన సంపంగి శ్రీనివాస్ ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో అతని భార్య బాలమ్మ (25), కుమారుడు వివేక్ (6 నెలలు)లను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

ఈ సంఘటనలో భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందడంతో శ్రీనివాస్ పా రిపోయాడు. హుజరాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సంపంగి శ్రీనివాస్‌కు విద్యానగర్‌కు చెందిన బాలమ్మతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా ఆరు నెలల కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ అనే యువకుడు వడ్డేర పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవలనే కుమారుడు జన్మించిన తరువాత వేరే కాపురం పెట్టిన శ్రీనివాస్ తరచూ భార్యతో గొడవ పడేవాడు కాగా శనివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకోగా తెల్లవారి తాగిన మత్తులో భార్యతో పాటు కుమారున్ని హత్య చేశాడు.

కాగా సంపంగి శ్రీనివాస్‌కు ఇప్పటికే ముగ్గురు భార్యలు ఉన్నట్లు సమాచారం. సిసిసి విద్యానగర్‌కు చెందిన బాలమ్మను నాల్గో వివాహం చేసుకొని సంచార జీవనం గడుపుతున్నాడు. భార్య, కుమారున్ని హతమార్చడంతో వారి కుటుంబంలో వి షాద చాయలు అలుముకున్నాయి. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల సిసి ఇన్స్‌పెక్టర్ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల సిఐ వేణుచందర్, ఎస్‌ఐలు సతీష్, ఉమాసాగర్‌లు, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments