Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మంచు లక్ష్మి సంక్రాంతి సంబురాలు

mnachu

ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబురాలను జరుపుకున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంట నగరాలలోని 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు మంచు లక్ష్మి నివాసానికి చేరుకొని సందడి చేశారు. తమ ప్రతిభా పాటవాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో పాటు టీచ్ ఫర్ ఛేంజ్ వాలంటీర్లకు మంచు లక్ష్మి సంక్రాంతి విందు భోజనాన్ని వడ్డించారు. ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి వేడుకలను జరుపుకునేవారమని, ఈ సంక్రాంతికి తన నివాసంలో సంబురాలను చేసుకోవడం ఆనందంగా ఉందని మంచు లక్ష్మి పేర్కొన్నారు. పేద, ధనిక అంతరాన్ని విద్యార్థుల్లో రానివ్వకుండా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, టీచ్ ఫర్ ఛేంజ్ వ్యవస్థాపకుడు చైతన్యతో పాటు 25 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments

comments