Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

తెలంగాణ తొలి వీణ చెన్నా

tg

మర్రి చెన్నారెడ్డి శతజయంతి ప్రారంభ వేడుకల్లో పుదుచ్చేరి సిఎం నారాయణ స్వామి ప్రశంస
నెంబర్ వన్ మొనగాడు: నాయిని

హైదరాబాద్/ ముషీరాబాద్ : తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష స్వరాష్ట్రం ఏర్పాటుకు 1969లోనే పునాది వేసిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పాండిచ్చేరి సిఎం నారాయణ స్వామి అన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి 99వ జయంతిని పురస్కరించుకొని శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందిరాపార్కులో చెన్నారెడ్డి సమాధివద్ద నారాయణస్వామి, మాజీ గవర్నర్ రోశయ్య, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపి హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డికె.అరుణ, ఎపి శాసనమండలి చైర్మన్ చక్రపాణిలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఏనాడు నష్టం చేయలేదన్నారు. నెంబర్ వన్ మొనగాడుగా అభివర్ణించారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి బాటులు వేశారని, అది 2001లో కేసిఆర్ స్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన నాయకత్వంలో కల సాకారం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఇచ్చిన మాటలకు నిలబడి సోనియాగాంధీనే తెలంగాణ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, సమావేశంలో మాజీ మంత్రి మర్రి శశీధర్‌రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, టిఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, మాజీ ఎంపి రవీంద్రనాయక్, కొండ విశ్వేశ్వరరావు, సమరసింహారెడ్డి, సుబ్బరాంరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments