Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

వివాహిత ఆత్మహత్య

lady
మనతెలంగాణ/లక్షెట్టిపేట రూరల్:
మండలంలోని అంకత్‌పల్లి గ్రామానికి చెందిన ఎంబడి రమాదేవి(28) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్సై సమ్మయ్య మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి భర్త కొద్ది రోజుల నుండి అప్పుడప్పుడు త్రాగుడుకు అలవాటు పడ్డాడని అదే క్రమంలో నూతన సంవత్సరం రోజు కూడా త్రాగి ఇంటికి వచ్చాడన్నారు. ఇంటికి వచ్చిన భర్తతో న్యూఇయర్ రోజు కూడా తాగి వస్తావా అని బార్య అనడంతో ఇద్దరికి సోమవారం రాత్రి గొడవ జరగడంతో క్షనికావేశంలో ఇంట్లో ఉన్న పంటకు కొట్టే పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. గమనించిన కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తండ్రి ఎగ్గిడి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Married suicide

Comments

comments