Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

జాతీయ పండుగగా మేడారం జాతర

mst

*భక్తుల కోసం హైటెక్నాలజీ వైఫై సేవలు
*జాతరలో 16 తాత్కాలిక బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లు
*మల్లూరు, రామప్పలో రూ.3.50కోట్లతో హెర్బల్ గార్డెన్లు
*మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్

వరంగల్ బ్యూరో: మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రప్రభుత్వం, ఉప రా్రష్ట్రపతి వెంకయ్యనాయుడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరడం జరిగిందని, మేడారం జాత ర ప్రాచుర్యాన్ని పార్లమెంట్‌లో కూడా వాణిని వినిపించ డం జరిగిందని మహబూబాబాద్ పార్లమెంట్‌సభ్యులు ప్రొఫెసర్ సీతారాంనాయక్ అన్నారు. సోమవారం వరంగల్ బిఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ నరేందర్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి రెండు సంవత్సరాలకోసారి పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం లో జరిగే గిరిజన కుంభమేళాగా పిలవబడే జాతర ఈ సంవత్సరం జనవరి 31నుంచి ఫిబ్రవరి 3వరకు నాలు గు రోజులపాటు జరగనున్నదని, దీనికి కోటికిపైగా భక్తు లు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారని, జాతరకు దేశ నలుమూలల నుంచి గిరిజనులతో పాటు ఇతరులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారన్నారు. జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పంపించడంతోపాటు కేంద్రప్రభుత్వ సంబంధిత మంత్రిత్వశాఖ మంత్రులతో పాటు, ఉపరాష్ట్రపతిని స్వయంగా కలిసి కోరడం జరిగిందని ఆయనన్నారు.
జాతర భక్తులకు ఉచితంగా వైఫై సేవలు
జాతర సందర్భంగా వచ్చు భక్తులకు అదేవిధంగా, అధికార యంత్రాంగం, మీడియా కోసం హైటెక్నాలజీ టెలి కాం సర్వీసుతో పాటు వైఫైని ఉచితంగా అందించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, లక్షలాదిగా వచ్చే భక్తులకు టెలికాం సేవలు అంతరాయం కలుగకుండా వరంగల్ నుంచి మేడారం జాతర వరకు 23శాశ్వత బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం టవర్స్ రోడ్డు పొడవున్నా ఉన్నాయని, అవికాకుండా తాడ్వాయి, పస్రా, మేడారం వరకు జాతరలో 16తాత్కాలిక బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం టవర్స్‌ను ఏర్పాటు చేసి అంతరాయం లేని వైఫైలతో పాటు మాట్లాడుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ నుంచి రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, చందులాల్ ఆదేశాల మేరకు రూ.20 లక్షలు బిఎస్‌ఎన్‌ఎల్ వరంగల్‌కు తాత్కాలిక టవర్ల ఏర్పాట్లకు హై టెక్నాలజితో కూడిన వైఫై సర్వీసులు అందించుటకు మంజూరి చేయడం జరిగిందనిఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మల్లూరు, రామప్పలో రూ.3.50కోట్లతో హెర్బల్ గార్డెన్‌లు
మేడారం, లక్నవరం, రామప్ప, ప్రాంతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుటకు ఇప్పటికే ఆయు ష్ శాఖ ద్వారా మల్లూరు, రామప్పలో రూ.3.50 కోట్ల వ్యయంతో రెండు హెర్బల్ గార్డెన్స్‌ను ఏర్పా టు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా పాలంపేట నుంచి రామప్ప కట్టవరకు రూ.4 కోట్లతో రహదారి విస్తరించి అభివృద్ధి చేయడంతో పాటు, రామప్ప కట్టపై రుద్రమదేవి విగ్రహం ప్రతిష్టించడం, అదేవిధంగా లక్నవరం చెరవును పర్యాటకులను ఆకర్షించే విధం గా అభివృద్ధి చేయడంతో పాటు, రూ.50 లక్షలతో జింకల పార్క్ ఏర్పాటు చేయడం రామప్ప పురాతన కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన తెలిపారు.
వరంగల్‌లోని కాకతీయుల కాలం నాటి చరిత్ర ప్రసిద్ధ గాంచిన కోట, వేయిస్తంభాల దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయుటకు పురాతన కట్టడాలను సంరక్షించుటకు, పరిరక్షించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయనన్నారు.
సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ నరేందర్ మాట్లాడుతూ మేడారం జాతరలో అందించనున్న హైటెక్నాలజి టెలికాం సర్వీసు మీడియం టారిఫ్‌ల గురించి వివరించారు.

Comments

comments