Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌..

 సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌..స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌

కరీంనగర్ ఎంపి బి. వినోద్‌కుమార్mp
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెగా పవర్‌లూం క్లస్టర్‌ను, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరానీని కోరినట్లు పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు.ఆదివారం సిరిసిల్లలో శ్రీఆయుత చ ండీ యాగాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.తెలంగాణలో 49,112 పవర్‌లూంలు ఉండగా అందులో 24,000 పవర్‌లూంలు సిరిసిల్లలోనే ఉ న్నాయని అందువల్ల సిరిసిల్లను మెగా పవర్‌లూం క్లస్టర్‌గా ప్రకటించాలని కేంద్రమంత్రిని అభ్యర్థించానన్నారు. సిరిసిల్లలో5,500పవర్‌లూంలను ఆధునీకరించుకున్నారని, 50 శాతం పవర్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారని, 1,300 మంది నేతన్నలకు ఇటీవలే లక్ష రూపాయల వరకు అప్పులు మంజూరయ్యాయని వివరించారు. అదే విధంగా కేంద్రం 1,300కోట్ల రూపాయలతో ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో భాగంగా సిరిసిల్లలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని కోరామన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభివృధ్ధికి, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సిఎం కెసిఆర్ సమాజంలోని అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు.
గొల్లకురుమలకు 5 వేల కోట్ల రూపాయలతో 30లక్షల గొర్రెలను అందించగా వాటికి మరో 8లక్షల పిల్లలు జన్మించాయన్నారు. రజక కుటుంబాల సంక్షేమం కోసం వాషి ంగ్ మిషిన్లు, క్షురకులకు ఆధునిక క్షౌరశాలలు, గౌడ్స్‌కు గిరిక తాళ్లు,చెట్లు ఎక్కే యంత్రాలను అందించనున్నారన్నా రు. పూర్తి వెనుకబడిన కులాలు, సంచార జాతుల కోసం 1,000కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. నీటి పా రుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతులకు 2018 మే నెలనుండి ఎకరానికి ఖరీఫ్, రబీలో 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం దేశంలోనే విప్లవాత్మక చర్య అన్నారు. 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి నూతన 2018వ స ంవత్సరం ప్రవేశించిన మరుక్షణం నుండి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అనేది చారిత్రాత్మకం అన్నారు.ప్రతివారికి పౌష్టికాహారంఅందాలనిగ్రామీణపేదల కోసం 800 కోట్ల రూపాయలతో బర్రెలు, గేదెల కొనుగోలు పథకం ప్ర వేశపెట్టి అందులో 50నుంచి 75 శాతం సబ్సిడీ ఇస్తున్నారన్నారు. మనోహరాబాద్ -కరీంనగర్ రైల్వేలైన్ పనులు, భూ సేకరణ సిద్దిపేట వరకు దాదాపుగా పూర్తి అయ్యాయన్నా రు. కరీంనగర్‌కు అన్ని జాతీయ రహదారులు కలుస్తున్నాయన్నారు. సిరిసిల్ల నుంచి పిట్లం వరకు జాతీయ రహదారిని ప్రతిపాదించామన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, ఈద శంకర్‌రెడ్డి, గూడూరి ప్రవీణ్, తోట ఆగయ్య, చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments