Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

కొత్త లుక్‌లో చిరు

CHIRU

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రమైన ‘ సైరా నరసింహారెడ్డి ’లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలనే ముగించుకుంది. ఈ సినిమా కోసం గడ్డం, మీసాలతో చిరంజీవి కనిపించిన విషయం తెలిసిందే. తదుపరి షూటింగ్‌కు సమయం ఉండడంతో చిరు క్లీన్ షేవ్‌తో ప్రస్తుతం దర్శనమిస్తున్నారు. ‘ జువ్వ ’ సినిమా టీజర్ రిలీజ్‌లో చిరు కొత్త లుక్‌తో దర్శనమివ్వడంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ‘ సైరా ’ సినిమా గ్రాఫిక్ వర్క్ కోసం చిరు మీసం లేకండా తీసేసినట్టు తెలిసింది. ‘ సైరా ’ రెండో షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Megastar Chiranjeevi New Look for SAIRA Film Graphics

Comments

comments