Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం!

hrsh

దాతల సహకారంతో రెండు కళాశాలల్లో ప్రారంభం
500 మంది విద్యార్థులకు లబ్ధి
నేడు సిద్దిపేటలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

సిద్దిపేట ప్రతినిధి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు మథ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రి హరీష్‌రావు సంకల్పించారు. దాతల సహకారంతో పాటు తన స్వంత డబ్బును ఉపయోగించి సిద్దిపేటలోని బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించే బృహత్‌కార్యానికి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులే అధికంగా చదువుతున్నారు. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయాన్నే వస్తుండటంతో కొందరు మధ్యాహ్నా నికి టిఫిన్ బాక్సులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా మధ్యాహ్న ఉపవాసం వుంటూ తరగతులకు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకవెళ్లారు. దీనిపై మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టిసారించి సిద్దిపేటలోని రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రతి రోజు ఉచితంగా మధ్యా హ్న భోజనం అందించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి కొంత ఖర్చును మం త్రి హరీష్‌రావు స్వయంగా భరిస్తుండగా మ రికొంత దాతల సహకారాన్ని తీసుకుంటున్నారు. రెండు జూనియర్ కళాశాలల్లో దాదా పు ఐదు వందల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి ప్రతి రోజు మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా మంగళవారం దీనిని ప్రారంభించనున్నారు. బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేరుగా వేరుగా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు కృషితో గత నాలుగు సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహించడంతో పాటు వీటికి హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తు వస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ టూ, ఎస్‌ఐ, డీఎస్సీ, టెట్ పరీక్షలకు ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహించి మధ్యాహ్నం భోజనాన్ని అందించారు. టెట్ అర్హత పరీక్షకు సంబంధించి ప్రతి రోజు వె య్యి మంది అభ్యర్థులకు ఉచితంగా మధ్యా హ్న భోజనాన్ని అందించడం గమనార్హం. వీ టన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి హరీష్‌రావు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వ పరంగా కాకుండా తానే స్వయంగా ఈ కార్యక్రమానికి అంకుర్పారణ చేస్తుండటం గమనా ర్హం. మంత్రి హరీష్‌రావు చొరవతో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం ప్రారంభం అవుతుందటం పట్ల ఉపాధ్యా యులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments