Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రుద్రూర్‌లో మైనింగ్ మాఫియా

lry

*జోరుగా మొరం తవ్వకాలు
*మామూళ్ల మత్తులో అధికారులు
*అధికార పార్టీ నాయకులే బడా
మాఫియా
*గుట్టలు హాంఫట్
*వాల్టా చట్టానికి తూట్లు

రూద్రుర్: మండల కేంద్రంలోని సులేమాన్ ఫారం, రాయకుర్ గ్రామాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు బడా మైనింగ్ మాఫియాగా రాజ్యమేలుతున్నారు. రాయకుర్‌లో రాణాంపల్లి పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఏకంగా గుట్ట ప్రాంతాన్ని అనుమతులు లేకుండా మొరం తవ్వి ధనార్జనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రంలోని సులేమాన్ ఫారం, రాయకుర్ గ్రామాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు బడా మైనింగ్ మాఫియాగా రాజ్యమేలుతున్నారు. రాయకుర్‌లో రాణాంపల్లి పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఏకంగా గుట్ట ప్రాంతాన్ని తవ్వి అనుమతులు లేకుండా మొరం తవ్వి ధనార్జనకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తన అక్రమార్జన కోసం అధికార పార్టీలో పేరున్న ప్రజాప్రతినిధి అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని అనునిత్యం రాత్రి వేళల్లో మొరం తవ్వకాలు సాగిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ మొరం మాఫియా పేరు చెబితే అధికారులు సైతం హడలెత్తుతున్నారు. రాయకూర్ ప్రాంతం నుండి మైన్స్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న మొరాన్ని రుద్రూర్, బోధన్ ప్రాంతాలకు తరలిస్తూ ఒక్కో క్క ట్రిప్పర్ 1500 నుంచి 2500 వరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం రెవె న్యూ అధికారులకు తెలిసినప్పటికీ నీమ్మకు నిరెత్తనట్లు వ్యవహరించడం గమనార్హం. రూద్రుర్ మండలంలోని అటు అక్బర్‌నగర్, ఇటు రాయకుర్ ప్రాంతా ల్లో గుట్ట ప్రాంతాలను అక్రమార్కులు పిండిచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం తవ్వకాలు సాగించాలంటే  రెవెన్యూ  అధికారుల వద్ద ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలించిన అధికారులు మైనింగ్ శాఖకు సిఫా ర్సు చేస్తారు. అక్రమార్కులు పట్టా భూముల పేరిట మొరం తవ్వకాలు సాగిస్తూ పట్టా భూములు గుట్ట ప్రాంతాల్లో మొరం తవ్వకాలు కొనసాగిస్తూ సూమారు 20 ఫీట్ల అడుగుల్లో జెసిబిల సహకారంతో మొరాన్ని తవ్వుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇదంతా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల ముందే సాగుతున్నప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయమై రుద్రూర్ తహసీల్దార్‌ను వివరణ కోరగా తము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వివరించారు. నిరుపేదలకు చెందాల్సిన భూములను బడాబాబులు ఆక్రమి ంచుకున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కుందాపూర్ శివారులోని సూమారు నలభై ఎకరాల వరకు కబ్జా చేసుకుని లాభార్జనే ధ్యేయంగా నిరుపేదలకు నయవంచన చేసి వారి భూములను  కబ్జా చేసి గుట్టల ను పిండి చేసి వాల్టా చట్టానికి తూట్లు పొడిచి భావితరాలకు ముప్పు వాటిల్లే విధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తూ, మరోవైపు ఇటుక బట్టీలు నిర్వహిస్తూ కొండలు, గుట్టలను మాయం చేస్తున్నారు.

Comments

comments