Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి హరీశ్‌రావుకు వినతి

harish

మనతెలంగాణ/ సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డులలో పని చేస్తున్నా 10,16 మంది సెక్యూరిటి గార్డ్ 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు, మార్కెటింగ్ శాఖ కమిష్‌నర్‌కు సెక్యూరిటీ గార్డుల రాష్ట్ర సంఘం ప్రతినిధులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ల యార్డులలో పనిచేస్తున్నామని కావున పెరిగిన నిత్యావసర వస్తువుల దృష్టా 20 వేల రూపాయల చోప్పున వేతనాలు ఇవ్వాలని 20వేల రూపాయలతో పాటు డిఎ, హెచ్‌ఆర్‌ఎ వసతులు కల్పించాలని మంత్రి హరిష్ రావుకు, కమిష్‌నర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పెర్కోన్నారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో సెక్యూరిటి గార్డ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాజు, కోశాదికారి మారుతి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సలీం, ఉపాధ్యక్షులు మల్లేషం, ప్రధాన కార్యదర్శి, జిల్లా కోశాదికారి కే కుమార స్వామి తదితరులు పాల్గోన్నారు.

Comments

comments